News March 18, 2024

DSCకి ఉచిత శిక్షణ.. దరఖాస్తు చేసుకోండి!

image

MBNR:BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో డిఎస్సీ పరీక్షలకు 75 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎ.స్వప్న సోమవారం అన్నారు. MBNR, NGKL,NRPT జిల్లాలకు చెందిన అర్హత గల బిసి అభ్యర్థులు www.tsbcstudycircle.cgg.gov.in వెబ్ సైడ్ లో(SGTకి ఈనెల 22న, SAకి ఏప్రిల్ 5వరకు) దరఖాస్తులు చేసుకోవాలని, ఎంపిక అయిన అభ్యర్థులకు రూ.1500 చొప్పున బుక్ ఫండ్ లేదా స్టడీ మెటీరియల్ అందిస్తామన్నారు.

Similar News

News August 16, 2025

పాలమూరు: అథ్లెటిక్స్.. రేపే ఎంపికలు

image

MBNRలోని DSA స్టేడియంలో అథ్లెటిక్స్ ఎంపికలు రేపు ఉ. 9:00 గం.కు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్ చంద్ర Way2Newsతో తెలిపారు. అండర్-14, 16, 18,& 20 బాల బాలికలకు విభాగాల్లో ఎంపికలు ఉంటాయని, ఆసక్తిగల విద్యార్థులు టెన్త్ మెమో, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌తో అథ్లెటిక్ కోచ్ సునీల్ కుమార్‌కు రిపోర్ట్ చేయాలన్నారు. మిగతా వివరాలకు 94406 56162, 98497 06360 సంప్రదించాలన్నారు. SHARE IT

News August 16, 2025

NRPT: 20న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు

image

NRPTలోని మినీ స్టేడియంలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌లో పాల్గొనేందుకు ఈనెల 20న బాల,బాలికలకు అండర్-14, 16,18,20 ఎంపికలు ఉంటాయని అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ Way2Newsతో తెలిపారు. U-14(15-10-2011/14-10-2023), U-16(15-10-2009/14-10-2011), U-18(15-10-2007/14-10-2009), U-20(15-10-2005/14-10-2007) మధ్య జన్మించి ఉండాలని, పూర్తి వివరాలకు 91007 53683,90593 25183 సంప్రదించాలన్నారు.

News August 15, 2025

MBNR: పోలీసు పరేడ్ మైదానంలో.. స్వాతంత్ర్య వేడుకలు

image

MBNRలోని పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాలను తిలకించారు. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.