News August 27, 2025

DSCలో ఐదు ఉద్యోగాలు సాధించిన చేనేత కుమారుడు

image

ఉరవకొండకు చెందిన వరలక్ష్మి, ఎర్రిస్వామి కుమారుడు శ్రీనివాసులు ఇటీవలే విడుదలైన DSC ఫలితాలలో 5 ఉద్యోగాలు సాధించి తన ప్రతిభను కనబరిచారు. ఈ విజయం సాధించడానికి తన తల్లిదండ్రుల కృషి ఎంతగానో ఉందని అభ్యర్థి తెలిపారు. తను DSCలో SA, TGT మ్యాథ్స్, SA, TGT ఫిజిక్స్, TGT సైన్స్, SGT విభాగాలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. వారి తల్లిదండ్రులు చేనేతలు.

Similar News

News August 27, 2025

ఖమ్మం: పర్యావరణ హితం.. మట్టి గణపయ్య రూపం

image

సత్తుపల్లిలో పలు ఉత్సవ కమిటీలు పర్యావరణానికి విఘాతం కలిగించకుండా మట్టి గణపతులను ఏర్పాటు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. స్థానిక జేవీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న ప్రసన్న గణపతి ఉత్సవ కమిటీ మనగుడి ప్రాంగణంలో 23 ఏళ్లుగా కోలకతా కళాకారులతో మట్టి గణపతిని తయారు చేయించి ప్రతిష్ఠిస్తున్నారు. అలాగే వాసవి క్లబ్, ఆరవైశ్య సంఘం ఆధ్వర్యంలో కోదండ రామాలయ ప్రాంగణంలో 14 ఏళ్లుగా మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజిస్తున్నారు.

News August 27, 2025

భారీ వర్షం.. పండగ పనులకు ఆటంకం

image

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆనందంగా వినాయక చవితి జరుపుకోవాలనుకున్న ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాల వల్ల మండపాలన్నీ తడిచి ముద్దయ్యాయి. పూజా సామగ్రి, ఇతర వస్తువుల కోసం బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ‘ఇవాళ ఒక్కరోజు వర్షాన్ని ఆపు గణపయ్యా’ అని భక్తులు వేడుకుంటున్నారు.

News August 27, 2025

HYD: గణపయ్య రాకకు.. గంగమ్మ స్వాగతం

image

HYDలో గణపయ్య రాకకు గంగమ్మ తల్లి స్వాగతం పలికింది. భక్తులు భారీగా తరలివచ్చి గణపయ్యను మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్తుండగా.. వర్షం తోడవడంతో ఆ తల్లి చల్లని దీవెనలని పలువురు సంతోషం వ్యక్తంచేశారు. వర్షంలోనే డాన్సులు చేస్తూ ఘనస్వాగతం పలికారు. నిన్న సాయంత్రం నుంచి వినాయకుడి విగ్రహాల తరలింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. నగరంలో ఈసారి సోలాపూర్, బాలగణపతి, మహారాజ్ రూపంలో ఉన్నవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.