News August 24, 2025
DSCలో 3 ఉద్యోగాలు సాధించిన రేవతి

ముదిగుబ్బ మండలం ఎనుములవారిపల్లెకు చెందిన వీరప్ప-లింగమ్మ కుమార్తె రేవతి డీఎస్సీలో 3 ఉద్యోగాలు సాధించింది. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన రేవతి 9వ ర్యాంక్‌తో స్కూల్ అసిస్టెంట్, 6వ ర్యాంక్‌తో PGT, TGT పోస్టులకు అర్హత సాధించింది. తన తల్లిదండ్రులు కష్టపడి చదివించారని, వారి కష్టం వృథా కాలేదని రేవతి అన్నారు.
Similar News
News August 24, 2025
జనగామ: ఇంటర్‌లో కాస్త మెరుగుపడిన ప్రవేశాలు..

ఉన్నత చదువులకు ప్రామాణికమైన ఇంటర్ విద్యకు ఆదరణ ఈ విద్యా సంవత్సరానికి కాస్త ఆదరణ పెరిగింది. జనగామ జిల్లాలో గతేడాది కంటే ఈ ఏడాది 310 మంది ఎక్కువ చేరినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 1,020 మంది చేరారు. గతేడాది 982 మంది మాత్రమే చేరారు. ఇంకా అడ్మిషన్లు కొనసాగుతున్నందున ప్రవేశాలు పెరుగుతాయని చెబుతున్నారు.
News August 24, 2025
భువనగిరి: నిరుద్యోగులకు, మహిళలకు ఉచిత శిక్షణ

జలాల్‌పూర్‌లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ నిరుద్యోగులకు, మహిళలకు ఉచిత వృత్తి శిక్షణ అందిస్తోంది. ఈ శిక్షణా కార్యక్రమాన్ని సంస్థ ఛైర్మన్ కిశోర్‌రెడ్డి ప్రారంభించారు. టాలీ, సోలార్ సిస్టం ఇన్‌స్టాలేషన్, కంప్యూటర్ హార్డ్‌వేర్, ఆటోమొబైల్ సర్వీసింగ్ వంటి అంశాల్లో ఈ శిక్షణ ఉంటుందని ఆయన తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన చెప్పారు.
News August 24, 2025
సిక్కోలు జిల్లాలో భార్యాభర్తలు ఆత్మహత్య

పింఛన్ రద్దై మనస్థాపం చెందిన కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన గార (M) అంపోలులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..గ్రామస్థుడు అప్పారావు(అంధుడు)కు వస్తున్న దివ్యాంగ పెన్షన్ రద్దైనట్లు ఇటీవల నోటీసులొచ్చాయి. ఆర్థికంగా సతమతమైన అప్పారావు భార్య లలిత, కుమార్తె దివ్య(17)లతో కలిసి శనివారం రాత్రి భోజనంలో ఎలుకల మందు కలుపుకొని సూసైడ్ చేసుకున్నారు. భార్యాభర్తలు మృతి చెందగా కుమార్తె చికిత్స పొందుతోంది.