News June 25, 2024

DSC నోటిఫికేషన్.. నెల్లూరుకు 673 పోస్టులు..!

image

సీఎం చంద్రబాబు DSCపై తొలి సంతకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి జులై1న షెడ్యూల్ విడుదల కానుంది. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 673 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో SGTకి 104 పోస్టులు కేటాయించారు. గత ప్రభుత్వంలో DSC కోసం అభ్యర్థులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేసిన విషయం తెలిసిందే..!

Similar News

News October 21, 2025

కందుకూరులో పోలీసులు అతి: YCP

image

కందుకూరులో పోలీసులు చాలా అతి చేస్తున్నారని YCP మండిపడింది. ‘TDPగూండాల చేతిలో దారుణ హత్యకి గురైన లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న YCP నేత అంబటి మురళిని పోలీసులు అడ్డుకున్నారు. నిందితులు టీడీపీ నేతలే కావడంతో ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయట్లేదు. అఖరికి పరామర్శకు సైతం దూరం చేస్తూ కాపులపై కక్ష సాధిస్తున్నావా చంద్రబాబు’ అని వైసీపీ ప్రశ్నించింది.

News October 21, 2025

VSUలో కరెంట్ కట్.. విద్యార్థులకు సెలవు

image

కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ(VSU) గర్ల్స్ హాస్టల్లో సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో కరెంటు సరఫరా నిలిచిపోయింది. విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే వర్సిటీ అధికారులు స్పందించి ఆడిటోరియం, ఏయూ బిల్డింగ్ ఇతర ప్రాంతాల్లో వసతి కల్పించారు. కరెంట్ లేకపోవడంతో మంగళవారం సెలవు ప్రకటించారు. ఇవాళ ఉదయం మెకానిక్‌లను పిలిపించి సరఫరా పునరుద్ధరించారు. జనరేటర్ లేకపోవడంపై విమర్శలు వచ్చాయి.

News October 21, 2025

సోమశిలకు ఎలాంటి ప్రమాదం లేదు: సీఈ

image

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు. జలాశయం నిండిన తర్వాత ఒకేసారి నీటిని విడుదల చేయకుండా.. ముందస్తు ప్రణాళికలో భాగంగా కొంతమేర నీటిని విడుదల చేస్తామని సీఈ వరప్రసాద్ వెల్లడించారు. అవసరాన్ని బట్టి నీటి విడుదల ఉంటుందన్నారు. ప్రస్తుతం జలాశయంలో 71 టీఎంసీల నీరు ఉండగా.. ప్రాజెక్టుకు ప్రమాదం లేదని స్పష్టం చేశారు.