News October 8, 2024
DSC శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

SC,ST విద్యార్థులకు ఉచిత DSC శిక్షణ ఇవ్వడానికి శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ ఇచ్చినందుకు శిక్షణ సంస్థలకు టెండర్ ద్వారా అమౌంట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన శిక్షణా సంస్థలు వివరాలకు https://tender.apeprocurernant.gov.in పోర్టల్‌లో డాక్యుమెంట్ నంబర్ 757795ను పరిశీలించి ఈ నెల 21లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
Similar News
News January 9, 2026
21న రంగోత్సవ్ పోటీలు: శ్రీకాకుళం DEO

గార మండలం వమరవెల్లి డైట్ కళాశాలలో జనవరి 21న జిల్లాస్థాయి రంగోత్సవ్ పోటీలు నిర్వహిస్తామని శ్రీకాకుళం DEO రవిబాబు శుక్రవారం ఓ ప్రకటలో తెలిపారు. భారత స్వాతంత్ర్య సమరయోధులు చిత్రాలు గీయటం, కొటేషన్లతో కూడిన హ్యాండ్ రైటింగ్, పంజాబి జానపద నృత్య పోటీలు ఉంటాయని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని కోరారు.
News January 9, 2026
‘రథసప్తమి’కి అంకురార్పణ

సూర్య భగవానుడి జన్మదినోత్సవమైన రథసప్తమి వేడుకలను ఈ ఏడాది ఏడు రోజుల పాటు రాష్ట్ర పండుగగా వైభవంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శుక్రవారం ఉదయం అరసవల్లి దేవస్థాన ప్రాంగణంలో ‘కర్టెన్ రైజర్’ కార్యక్రమంతో రథసప్తమి ఉత్సవాలకు అధికారికంగా అంకురార్పణ చేశారు. జనవరి 19 నుంచి 25 వరకు ఏడు రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
News January 9, 2026
శ్రీకాకుళం: ప్రభుత్వ న్యాయవాదిగా ఇప్పిలి తాత నియామకం

శ్రీకాకుళం జిల్లా కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా ఇప్పిలి తాతను ప్రభుత్వం నియమించింది. గురువారం సాయంత్రం ఈ ఆదేశాలు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ పదవిలో తను మూడేళ్లు కొనసాగుతానని చెప్పారు. గతంలో ఈయన నరసన్నపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. పలువురు న్యాయవాదులు ఆయనను అభినందించారు.


