News April 20, 2025

DSC: అనంతపురం జిల్లాలో పోస్టులు ఇలా..

image

అనంతపురం జిల్లాలో 807 టీచర్ పోస్టులను <<16155926>>భర్తీ<<>> చేయనున్నారు. సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇలా..
➤ స్కూలు అసిస్టెంట్ లాంగ్వేజ్: 37
➤ హిందీ: 28 ➤ ఇంగ్లీష్: 103
➤ గణితం: 43 ➤ఫిజిక్స్: 66
➤ జీవశాస్త్రం: 72 ➤ సోషల్: 111
➤ పీఈటీ: 145 ➤ఎస్జీటీ: 202 ఉన్నాయి.
NOTE: ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో ఫిజిక్స్ 1, జీవశాస్త్రం 1, ఎస్జీటీ 2 పోస్టులు భర్తీ కాబోతున్నాయి.

Similar News

News April 20, 2025

హసీనా అరెస్టుకు ఇంటర్‌పోల్‌ సాయం కోరిన బంగ్లా

image

బంగ్లాదేశ్ మాజీ పీఎం షేక్ హసీనా సహా 12 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఆ దేశ పోలీసులు ఇంటర్‌పోల్‌ను కోరారు. బంగ్లా చీఫ్ అడ్వైజర్‌గా యూనస్ బాధ్యతలు చేపట్టాక హసీనాతో పాటు మాజీ మంత్రులు, ఆర్మీ అధికారులపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇంటర్‌పోల్ రెడ్ నోటీస్ ఇస్తే ఆ వ్యక్తులు ఏ దేశంలో ఉన్నా అరెస్ట్ చేసేందుకు వీలవుతుంది. కాగా హసీనా గతేడాది AUG 5 నుంచి భారత్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.

News April 20, 2025

సీఎం చంద్రబాబు బర్త్ డే.. కేక్ కట్ చేసిన పరిటాల సునీత

image

సీఎం చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలోని తిరుమల దేవర దేవస్థానంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు చేయించారు. తమ అధినేత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

News April 20, 2025

పెనమలూరు: రూ. 22 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

image

ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న తాడిగడపకు చెందిన నూకల విజయశ్రీని సైబర్ నేరగాళ్లు భారీ మోసం చేశారు. ఆన్‌లైన్ టాస్కుల పేరుతో గ్రూపుల్లో చేర్చి, పెట్టుబడికి అధిక లాభాలంటూ నమ్మబలికిన నేరస్తులు దశలవారీగా ఆమె నుంచి రూ.22 లక్షలు దోచుకున్నారు. స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!