News August 30, 2025
DSC 2025: ఒకే గ్రామంలో ఆరుగురికి ఉద్యోగాలు

నంద్యాల మండలంలోని చాపరేవుల గ్రామస్థులు డీఎస్సీ ఫలితాల్లో రాణించారు. ఈసారి గ్రామానికి చెందిన ఆరుగురు ఉపాధ్యాయ పోస్టులు సాధించారు. వారిలో మారెళ్ల రజిత, మోహన్ కుమార్, ఎర్రమల రంగన్న, మాతిరెడ్డి భారతి, అనూష పీఈటీలుగా, సురేఖ ఎస్జీటీగా ఎంపికయ్యారు. సురేఖ కానిస్టేబుల్‌గా పనిచేస్తూనే ఉపాధ్యాయ ఉద్యోగం సాధించగా, రజిత ఏపీ-తెలంగాణ రెండింటిలోనూ పీఈటీగా ఎంపికై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
Similar News
News August 30, 2025
జగదేవ్‌పూర్: పంచాయతీ కార్యదర్శి సస్పెండ్: కలెక్టర్

జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శైలేష్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హైమావతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో ఇద్దరు డెంగ్యూతో మరణించిన నేపథ్యంలో ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందున కార్యదర్శిని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
News August 30, 2025
పోలీసుల వైఫల్యం లేదు: కోటంరెడ్డి

ప్రాణమంటే ఎవరికైనా తీపేనని.. తనను తాను ఎలా కాపాడుకోవాలో తెలుసని నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి చెప్పారు. ‘మంత్రివర్గ విస్తరణలో నా పేరు ఉందనే వివాదాలు చుట్టుముట్టాయని అంటున్నారు. నేను మూడోసారి గెలిచి 14 నెలలు అవుతోంది. అందరికీ మంచే చేశాను. ఏ వివాదాల జోలికి నేను వెళ్లలేదు. పోలీసుల వైఫల్యం లేదు. వీడియో గురించి ఎస్పీకి తెలిసిన వెంటనే నాకు చెప్పలేదనే చిన్న అసంతృప్తి మాత్రం ఉంది’ అని కోటంరెడ్డి అన్నారు.
News August 30, 2025
సంగారెడ్డి: ‘శాంతి భద్రతలకు సహకరించండి’

సంగారెడ్డి జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు పోలీస్ చట్టం అమల్లో ఉంటుందని ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించరాదని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ఎవరైనా కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.