News June 12, 2024
డీఎస్సీ దరఖాస్తు గడువు పొడిగింపు

TG: టెట్లో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడు టెట్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు పొడిగించింది. ఇప్పటివరకు దాదాపు 2.35 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఈ పరీక్షలు జులై 17 నుంచి 31 వరకు జరగనున్నాయి.
Similar News
News December 1, 2025
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరల పెరుగుదల కొనసాగుతోంది. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.660 పెరిగి రూ.1,30,480కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.600 ఎగబాకి రూ.1,19,600 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.4,000 పెరిగి రూ.1,96000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 1, 2025
ఈ దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుంటే?

స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః|
అనాదినిధనో ధాతా విధాతా ధాతు రుత్తమః||
తనంతట తాను అవతరించిన శాంతి స్వరూపుడు, సూర్యుడికి జన్మనిచ్చిన కలువ పూల కన్నులు కలవాడు విష్ణుమూర్తి. ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించి, నిర్మించి, పాలించే ఆయనను పూజించడం కన్నా మోక్ష మార్గం మరొకటి లేదు. అందుకే ఆ దివ్య మంగళ రూపాన్ని ధ్యానించాలి. అప్పుడే మనస్సుకు శాంతి లభిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>