News October 6, 2024
డీఎస్సీ సర్టిఫికెట్ పరిశీలన పూర్తి

TG: రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఒక్కో ఉద్యోగానికి 1:3 చొప్పున 25,924 మందిని వెరిఫికేషన్‌కు పిలవగా 24,466 మంది హాజరయ్యారు. మరోవైపు స్పెషల్ ఎడ్యుకేషన్ కోటాలో టీచర్ పోస్టులకు కొన్ని జిల్లాలో వెరిఫికేషన్ ప్రారంభం కాలేదు. కాగా డీఎస్సీ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ఈ నెల 9న LB స్టేడియంలో నియామక పత్రాలను సీఎం రేవంత్ అందజేయనున్నారు.
Similar News
News March 22, 2026
నెల్లూరు నగరంలో దారుణ హత్య!

నెల్లూరు నగరంలో బోడిగోడి తోటలో దారుణ హత్య జరిగినట్లు సమాచారం. వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తిని ఈ హత్య చేసి కాల్చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 22, 2026
లక్ష్యాన్ని మించి రబీ సాగు!

AP: మొంథా, దిత్వా తుఫాన్లతో భారీ వర్షాలు కురిసినా రబీ సాగుకు ఆటంకం కలగలేదు. ఈ సీజన్‌లో 20.79L హెక్టార్లలో 22 పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా ఏకంగా 27.36L హెక్టార్లలో రైతులు పంటలు వేశారు. వరి, మొక్కజొన్న, శనగ, వేరుశనగ, అపరాలు, చిరు ధాన్యాలు, పొగాకు, నూనె గింజలను సాగు చేశారు. కృష్ణా, గోదావరి డెల్టాలతోపాటు నదులు, చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండటంతోనే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు.
News March 22, 2026
‘పెద్ది’లో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్?

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే సాంగ్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ కూడా స్పెషల్ సాంగ్‌లో స్క్రీన్ షేర్ చేసుకుంటారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం మృణాల్ తెలుగులో అడివి శేష్‌తో కలిసి ‘డెకాయిట్’ మూవీలో నటిస్తున్నారు.


