News October 1, 2024
DSC: నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

TG: డీఎస్సీ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో నేటి నుంచి ఈనెల 5 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి అభ్యర్థులకు ఈమెయిల్, SMS ద్వారా సమాచారం ఇస్తామన్నారు. ప్రతి పోస్టుకు 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి, అనంతరం 1:1 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థుల నుంచి వెబ్ ఆప్షన్స్ తీసుకుని, వాటి ఆధారంగా పోస్టింగ్స్ ఇస్తారు.
Similar News
News November 20, 2025
పోలి పాడ్యమి కథ అందిస్తున్న సందేశాలివే..

☞ భగవంతుడికి కావాల్సింది ఆడంబరం కాదు, పోలి వలె నిజాయితీ, తపనతో కూడిన శ్రద్ధ మాత్రమే.
☞ అహంకారం పతనానికి దారి తీస్తుందని అత్తగారి ఉదంతం హెచ్చరిస్తుంది. అహంకారంతో చేసే పూజలు నిష్ప్రయోజనం.
☞ సంకల్ప శక్తి ముఖ్యం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ధర్మాన్ని పాటించాలనే మనసు ఉంటే మార్గం దానంతట అదే దొరుకుతుంది.
☞ కుటుంబ సఖ్యత కోసం అసూయ, కంటగింపులను విడిచిపెట్టాలని ఈ కథ బోధిస్తుంది.
News November 20, 2025
అదును తప్పిన పైరు.. ముదిమిలో బిడ్డలు ఒక్కటే

ఏ పంటకైనా అదును(అనుకూల సమయం) ముఖ్యం. సరైన సమయానికి విత్తనం వేయకపోతే పంట సరిగా రాదు, దాని వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే ముసలి వయసులో పిల్లలు పుడితే, వారు తల్లిదండ్రులకు అండగా నిలబడలేరు లేదా వారికి సేవ చేయలేరు. ఈ రెండూ సమయానికి చేయని పనులు లేదా నిష్ప్రయోజనమైన పరిస్థితులను తెలియజేస్తాయి.
News November 20, 2025
హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా బుధవారం రాత్రి వరకు హిడ్మా, అతని భార్య రాజేతోపాటు మరో మావోయిస్టు మృతదేహానికి మాత్రమే రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. మరో ముగ్గురి మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు వేచి చూస్తున్నారు.


