News October 4, 2024

రేపటిలోగా డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి: సీఎం

image

TG: ఈనెల 5వ తేదీలోపు అన్ని జిల్లాల్లో డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఎంపికైన 11,062 మంది అభ్యర్థులకు దసరా పండుగలోపు ఈనెల 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తామని తెలిపారు. కాగా ఇప్పటికే 9,090 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

Similar News

News December 10, 2025

VJA: దీక్షా విరమణ.. బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన సీపీ

image

విజయవాడలో రేపటి నుంచి ప్రారంభమయ్యే భవాని దీక్షల విరమణ కార్యక్రమాల నేపథ్యంలో సీపీ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆదేశాలతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రాత్రి వేళ స్నాన ఘాట్లు, హోల్డింగ్ ఏరియా, వినాయక ఆలయం వద్ద క్యూలైన్లను పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News December 10, 2025

చీకటి గదిలో ఫోన్ చూస్తున్నారా?

image

చాలామందికి నిద్రపోయే ముందు ఫోన్ చూడటం అలవాటు. అలా చూడటం కళ్లకు మంచిది కాదని తెలిసినా ‘తప్పదు’ అని లైట్ తీసుకుంటారు. అయితే ఆ ‘లైట్’ ముఖ్యం అంటున్నారు వైద్యులు. గదిలోని అన్ని లైట్లు ఆర్పేసి చీకట్లో ఫోన్ చూడటం వల్ల దాని కాంతి నేరుగా కళ్లపై పడి అవి దెబ్బతినే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రాత్రివేళ ఫోన్ చూసినప్పుడు తప్పనిసరిగా గదిలో వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

News December 10, 2025

వైద్య సహాయానికి రికార్డ్ స్థాయిలో CMRF నిధులు

image

TG: పేద, మధ్య తరగతి ప్రజల వైద్యానికి అందించే CMRF సహాయంలో రికార్డ్ నెలకొల్పినట్లు ప్రభుత్వం తెలిపింది. 2014-24 మధ్య కాలంలో ఏటా రూ.450Cr నిధులు కేటాయించగా గత రెండేళ్లలో ఏటా రూ.850Cr సహాయం అందించినట్లు ప్రకటించింది. ఈ రెండేళ్లలో 3,76,373 మంది లబ్ధిదారులకు రూ.1,685.79Cr పంపిణీ చేసినట్లు పేర్కొంది. LOCల ద్వారా రూ.533.69Cr, రీయింబర్స్‌మెంట్ ద్వారా రూ.1,152.10Cr పంపిణీ చేసినట్లు తెలిపింది.