News June 27, 2024

2, 3 రోజుల్లో డీఎస్సీ పూర్తి షెడ్యూల్?

image

తెలంగాణలో డీఎస్సీ పూర్తి షెడ్యూల్‌ను 2, 3 రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. పరీక్షల వాయిదా ఉండదని, ముందుగా ప్రకటించిన తేదీల్లోనే (జులై 17-జులై 31) జరుగుతాయని స్పష్టం చేశారు. అభ్యర్థులకు తమ సొంత జిల్లాలో ఒకే రోజు పరీక్షలు రాసేలా కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. డీఎస్సీ దరఖాస్తుల గడువు ఈనెల 20తో ముగియగా, 2.79 లక్షల దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే.

Similar News

News April 16, 2026

హీరోయిన్ తమన్నాకు షాక్

image

స్టార్ హీరోయిన్ తమన్నాకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ‘పవర్ సోప్స్’ సంస్థతో తన ఒప్పందం(2008-09) ముగిశాక కూడా తన ఫొటోలను 2010-11లో ప్రచారానికి వాడుకున్నారని, ఇది నిబంధనల ఉల్లంఘన అని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఇందుకు రూ.కోటి పరిహారం ఇప్పించాలని ఆమె విన్నవించుకున్నారు. అయితే దీనివల్ల నటి ప్రతిష్ఠకు ఎలాంటి భంగం కలగలేదని, నష్టపరిహారం ఇప్పించడానికి సరైన ఆధారాలు లేవని కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.

News April 16, 2026

యుద్ధం సెగ.. సబ్బుల ధరలకు రెక్కలు!

image

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతోంది. క్రూడాయిల్ ధరలు పెరగడం, సముద్ర మార్గాల్లో రవాణా అడ్డంకులు నిత్యావసరాల ధరలను పెంచేస్తున్నాయి. ముడి పదార్థాల ధరలు, ప్యాకేజింగ్ ఖర్చులు భారమవ్వడంతో సబ్బులు, షాంపులు, సర్ఫ్‌లు సహా మరికొన్ని నిత్యావసర వస్తువుల రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే HUL తమ లిరిల్, పియర్స్, డవ్ వంటి బ్రాండ్లతో ఉన్న ప్రొడక్ట్స్ ధరలను ₹2-₹3 వరకు పెంచింది.

News April 16, 2026

మహిళా రిజర్వేషన్ల అమలుకు సమయం ఆసన్నమైంది: అర్జున్ మేఘ్వాల్

image

పార్లమెంటు చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. లోక్‌సభలో ఇవాళ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలుకు బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘2023లోనే నారీశక్తి వందన్ అధినియం బిల్లు ఆమోదం పొందింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయింపును పార్లమెంటు ఆమోదించింది. దీన్ని అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది’ అని వ్యాఖ్యానించారు.