News September 4, 2024
నేడు డీఎస్సీ ఫైనల్ కీ విడుదల?

TG: డీఎస్సీ ఆన్లైన్ పరీక్షల ఫైనల్ కీని పాఠశాల విద్యాశాఖ ఇవాళ విడుదల చేసే ఛాన్సుంది. దీని ప్రకారం అభ్యర్థులు తమకు వచ్చిన మార్కులను ఎవరికివారు తెలుసుకోవచ్చు. తుది కీ విడుదలైన తర్వాత 2, 3 రోజుల్లో డీఎస్సీ మార్కులకు (80%), టెట్ మార్కులు (20%) కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంక్ లిస్టును అధికారులు విడుదల చేస్తారు.
Similar News
News January 13, 2026
670 సార్లు అప్లై చేసినా పట్టించుకోలేదు.. కట్ చేస్తే..

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం కంటే తెలివితక్కువ పని ఇంకోటి లేదంటున్నారో టెకీ. ‘రిక్రూటర్లకు 670 అప్లికేషన్లు, 1000 మెసేజ్లు పంపినా పట్టించుకోలేదు. దీంతో దరఖాస్తులు ఆపేశా. వ్యక్తిగతంగా ప్రొడక్ట్ బిల్డింగ్, కంటెంట్ క్రియేషన్, నెట్వర్కింగ్పై ఫోకస్ చేశా. జనవరి-మే మధ్య 83మంది రిక్రూటర్లు సంప్రదించారు’ అని మర్మిక్ పటేల్ అనే వ్యక్తి తెలిపారు. మెటాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నట్లు చెప్పారు.
News January 13, 2026
నెలసరికి ముందు రొమ్ము నొప్పా?

నెలసరికి ముందు వక్షోజాల్లో నొప్పి, బరువుగా ఉన్నట్లు అనిపించడం లాంటి సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. దీన్ని ‘ప్రీ మెన్స్ట్రువల్ మాస్టాల్జియా’గా పిలుస్తారు. ఒక వయసు వచ్చాక అండం విడుదల సమయంలో వెలువడే ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఈ నొప్పికి కారణం. అయితే ఈ నొప్పి బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణం ఏమో అని చాలా మంది భయపడతారు. కానీ అది అపోహే అంటున్నారు నిపుణులు. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలి.
News January 13, 2026
మేడారం జాతరకు 3 కోట్ల మంది భక్తులు: సీతక్క

TG: గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం జాతరకు దాదాపు రూ.250 కోట్లు కేటాయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ సారి జాతరకు 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. అమ్మవార్లను దర్శించుకునేందుకు ఇప్పటికే భక్తులు భారీగా తరలివెళ్తున్నారు.


