News September 14, 2025

రేపు డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్

image

AP: డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్టులను రేపు విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ తుది ఎంపిక జాబితాలు DEO, కలెక్టర్ కార్యాలయాల్లో, https://apdsc.apcfss.in/లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. కాగా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన వారికి ఈ నెల 19న అమరావతిలో అపాయింట్‌మెంట్ లెటర్లను అందజేయనున్నారు. 16,347 ఉద్యోగాలకు ఈ ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News September 14, 2025

OG: డబ్బింగ్ పూర్తి చేసిన పవన్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీలో తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ‘OGని మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలానే ముగించారు’ అని పేర్కొంటూ పవన్ ఫొటోలను షేర్ చేసింది. అంతకుముందు డైరెక్టర్ సుజిత్, తమన్‌తో పవన్ ఉన్న ఫొటోను పంచుకుంది. ‘మిలియన్ డాలర్ పిక్చర్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. OG లోగోతో ఉన్న డ్రెస్‌ను పవన్ ధరించడం గమనార్హం. ఈ మూవీ SEP 25న రిలీజ్ కానుంది.

News September 14, 2025

ఒకే కాన్పులో నలుగురు బిడ్డలు… మొత్తం ఏడుగురు..

image

మహారాష్ట్రలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురికి(క్వాడ్రాప్లెట్స్) జన్మనిచ్చింది. పుణే జిల్లాలోని సస్వద్‌కు చెందిన 27 ఏళ్ల మహిళ సతారా ఆస్పత్రిలో పురిటినొప్పులతో చేరారు. అక్కడ వైద్యులు ఆమెకు కాన్పు చేయగా ఓ మగ, ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఒకే కాన్పులో నలుగురు పుట్టడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. కాగా ఆ మహిళకు గతంలోనూ ట్విన్స్ పుట్టారు. మరో బాలుడు కూడా ఉన్నారు. మొత్తం ఏడుగురికి ఆమె జన్మనిచ్చింది.

News September 14, 2025

8 వికెట్లు తీసిన భారత్

image

పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. తొలి రెండు ఓవర్లలోనే ఓపెనర్లను ఔట్ చేయగా జమాన్(17), కెప్టెన్ సల్మాన్‌(3)ను అక్షర్ పెవిలియన్ పంపారు. ఇన్నింగ్స్ 12 ఓవర్లో కుల్దీప్ వరుస బంతుల్లో హసన్(5), మహ్మద్ నవాజ్(0)ను ఔట్ చేశారు. 17.4 ఓవర్లలో పాక్ స్కోరు 97/8.