News November 28, 2024
వారికి డీఎస్సీ ఉచిత కోచింగ్

AP: డీఎస్సీకి ప్రిపేరవుతున్న మైనార్టీ విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి ఫరూఖ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రముఖ ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో ఈ శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. దీని కోసం అభ్యర్థులు www.apcedmmwd.org వెబ్సైట్ లేదా మెనార్టీ డైరెక్టర్ కార్యాలయంలో అప్లై చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 0866-2970567 నంబర్కు సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Similar News
News September 16, 2025
డ్వాక్రా సంఘాలు మరింత ఎత్తుకు ఎదగాలి: CBN

AP: మహిళా సాధికారత కోసం తీసుకువచ్చిన డ్వాక్రా సంఘాలు మరింత ఎత్తుకు ఎదగాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘కోటీ 20 లక్షల మంది అతిపెద్ద మహిళా సైన్యం డ్వాక్రా సంఘాల రూపంలో రాష్ట్రానికి ఉంది. నేను ప్రారంభించిన ఈ సంఘాలను ఎవరూ ఏం చేయలేకపోయారు. మహిళా సంఘాలకు రుణం ఇస్తే డబ్బులు బ్యాంకులో ఉన్నట్టే. డ్వాక్రా సంఘాల టర్నోవర్ రూ.10 లక్షల కోట్లకు ఎదగాలని ఆశిస్తున్నా’ అని తెలిపారు.
News September 16, 2025
రానున్న 2-3 గంటల్లో వర్షం.. భారీగా ఈదురు గాలులు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, కరీంనగర్, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షం కురవొచ్చని అంచనా వేసింది. గంటకు 41-61కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
News September 15, 2025
DANGER: నిద్ర మాత్రలు వాడుతున్నారా?

నిద్ర పట్టేందుకు కొందరు స్లీపింగ్ పిల్స్ వాడుతుంటారు. అయితే వీటి వాడకం ఎక్కువైతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జ్ఞాపకశక్తి తగ్గడం, తల తిరగడం, ఆందోళన, మెదడు బద్ధకించడం, చూపు అస్పష్టంగా మారడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. వరుసగా 2 రోజులు ఈ మాత్రలు వేసుకుంటే బానిసలవుతారని, డోస్ పెంచాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.