News July 10, 2024
రేపటి నుంచి వెబ్సైట్లోకి డీఎస్సీ హాల్ టికెట్లు

TG: ఈ నెల 18 నుంచి వచ్చే నెల 5 వరకు ఆన్లైన్లో జరిగే డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లు రేపటి నుంచి వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. www.schooledu.telangana.gov.in సైట్ నుంచి అభ్యర్థులు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మొత్తం 11,062 పోస్టుల భర్తీకోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News December 2, 2025
హనుమాన్ చాలీసా భావం – 27

సబ పర రామ తపస్వీ రాజా। తినకే కాజ సకల తుమ సాజా॥
రాముడు రాజైనా రుషిలా నిగ్రహం, ధర్మపాలన కలవాడు. అలాంటి ధర్మమూర్తి సీతాన్వేషణ, లంకా విజయం వంటి ముఖ్య కార్యాలన్నీ ఆంజనేయుడే చక్కబెట్టాడు. హనుమంతుడు రామునికి కేవలం సేవకుడు కాదు, గొప్ప కార్యసాధకుడు. ఈ కథ మనకు కర్తవ్య నిష్ఠను బోధిస్తుంది. మన లక్ష్యం గొప్పదైనా, నిస్వార్థ సేవ, సంకల్పబలంతో తప్పక విజయం సాధించవచ్చు. <<-se>>#HANUMANCHALISA<<>>

పవన్ సారీ చెబుతారా?

కోనసీమకు <<18446578>>దిష్టి<<>> తగిలిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పలువురు తెలంగాణ నేతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. పవన్ను బహిరంగంగానే తప్పు పడుతూ వెంటనే సారీ చెప్పాలని మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్తో పాటు BRS నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏదైనా కాస్త ఆలోచించి మాట్లాడి ఉండాల్సిందని మరికొందరు అంటున్నారు. దీనిపై పవన్ సారీ చెబుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.