News March 7, 2025
రిజర్వేషన్లపై రిపోర్టు రాగానే DSC నోటిఫికేషన్: మంత్రి లోకేశ్

AP: డీఎస్సీ నోటిఫికేషన్ను ఈనెలలోనే విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ మరోసారి స్పష్టం చేశారు. 16,347 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రిజర్వేషన్ల ఖరారు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని, కమిషన్ నుంచి రిపోర్టు రాగానే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ‘DSC నోటిఫికేషన్ ఎప్పుడిచ్చినా కేసులయ్యేవి. గతంలో దాఖలైన కేసులపై స్టడీ చేస్తున్నాం. అభ్యంతరాలు లేని నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని తెలిపారు.
Similar News
News December 1, 2025
హైదరాబాద్లో 45 పోస్టులకు నోటిఫికేషన్

HYD సనత్నగర్లోని <
News December 1, 2025
మాయదారి మహమ్మారికి ఆరేళ్లు..!

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ‘కరోనా’ మహమ్మారిని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. చైనా వుహాన్లో తొలి కరోనా కేసు నమోదై నేటికి ఆరేళ్లు. 2019లో మొదలైన ఈ మహమ్మారి అతి తక్కువ కాలంలోనే ప్రపంచాన్ని చుట్టుముట్టింది. 70లక్షల మంది ప్రాణాలను హరించి, కోట్లాది మందిని రోడ్డున పడేసింది. భారీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న మానవాళి.. టీకాలు, ఆరోగ్య నియమాలతో పోరాడి గెలిచింది. కరోనా మీ జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది?
News December 1, 2025
రేపు హైకోర్టుకు పరకామణి కేసు నివేదిక

AP: టీటీడీ పరకామణి కేసు విచారణ నేటితో పూర్తి కానుంది. రేపు సీఐడీ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. హైకోర్టు ఆదేశాలతో అక్టోబర్ 27 నుంచి సీఐడీ.. టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి సహా 35 మందిని విచారించింది. విచారణకు హాజరవుతూ అప్పటి AVSO సతీశ్ అనుమానాస్పదంగా మరణించారు. చెన్నై, బెంగళూరు, విశాఖలో నిందితుడు రవికుమార్ ఆస్తులను పరిశీలించింది.


