News November 18, 2024
DSC నోటిఫికేషన్ మరింత ఆలస్యం?

AP: షెడ్యూల్ ప్రకారం DSC నోటిఫికేషన్ ఈనెల 6న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వర్గీకరణ ఎలా చేయాలన్న దానిపై ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత, 2, 3 నెలల్లో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి టీచర్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 26, 2025
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దొరికే ఫుడ్స్ ఇవే

ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఆహారపదార్థాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒక రోజుకి మహిళలకు 1.1గ్రాము, పురుషులకు 1.6 గ్రాముల ఒమేగా 3 అవసరమవుతుంది. కేవలం చేపల్లోనే కాకుండా వాల్నట్స్, కిడ్నీబీన్స్, కనోలా ఆయిల్, అవిసె గింజలు, చియా సీడ్స్లో కూడా ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. శాకాహారులు, వీగన్లు కూడా వీటిని తిని ఫ్యాటీ ఆమ్లాలను పొందచ్చని నిపుణులు చెబుతున్నారు.
News November 26, 2025
డైరెక్టర్ సంపత్ నంది తండ్రి కన్నుమూత

టాలీవుడ్ డైరెక్టర్ సంపత్ నంది ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి కిష్టయ్య(73) అనారోగ్యంతో నిన్న రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సంపత్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు చేశారు. ‘చిన్నప్పుడు జబ్బు చేస్తే నన్ను భుజంపై 10KM మోసుకెళ్లింది మొన్నే కాదా అనిపిస్తోంది. నీకు నలుగురు పిల్లలున్నారు. వాళ్లకీ బిడ్డలున్నారు. ఏ కడుపునైనా ఎంచుకో. ఏ గడపనైనా పంచుకో. కానీ మళ్లీ రా’ అని రాసుకొచ్చారు.
News November 26, 2025
ఆస్పత్రి నుంచి స్మృతి తండ్రి డిశ్చార్జ్.. పెళ్లిపై ప్రకటన ఉంటుందా?

మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు యాంజియోగ్రఫీ సహా అన్ని టెస్టులు పూర్తయ్యాయని, ఎక్కడా బ్లాక్స్ లేవని వైద్యులు తెలిపారు. మరోవైపు స్మృతి పెళ్లిపై వెలువడుతున్న ఊహాగానాలకు కుటుంబం సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. పలాశ్ ముచ్చల్ వేరే యువతితో చేసిన చాటింగ్ బయటకు రావడంతో పెళ్లి రద్దు చేసుకున్నట్లు వార్తలు వస్తున్న విషయం <<18385575>>తెలిసిందే.<<>>


