News August 27, 2024
DSPని పరామర్శించిన ఎస్పీ కృష్ణ కాంత్

ప్రమాదంలో గాయపడిన నెల్లూరు రూరల్ DSP శ్రీనివాసరావు ఇంటికి జిల్లా యస్.పి. కృష్ణకాంత్ వెళ్లి పరామర్శించారు. DSP ధైర్య సాహసాలను ఎస్పీ మెచ్చుకొని, స్యయంగా ప్రశంసాపత్రం అందించి అభినందించారు. జిల్లా పోలీసు యంత్రాంగం వారి వెంటే ఉందని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. త్వరగా పూర్తిగా కోలుకొని, కలిసి విధులు నిర్వహించాలని రూరల్ DSP కి మనోధైర్యం చెప్పిన అన్ని విధాల తోడ్పాటు అందిస్తామన్నారు.
Similar News
News December 17, 2025
నెల్లూరు: ప్రాణాలు పోతున్నా.. చలించరా..?

ప్రాణాపాయం కేసులను ఒకవేళ అడ్మిట్ చేసుకుంటే చికిత్సలో ప్రాణాలు పోతే తమపైకి వస్తుందేమోననే నెపంతో వైద్యులు రిస్క్ తీసుకోకుండా రెఫర్ చేస్తున్నారు. ఆసుపత్రుల్లో వసతులు, వైద్యుల కొరత ఉండడంతో GGHకి రెఫర్ చేస్తున్నారు. జిల్లాలో 108 ద్వారా వచ్చిన అత్యవసర కేసులు పరిశీలిస్తే Sep (3063),OCT(3340), NOV(3024), DEC(559) రాగా.. వీటిల్లో SEP(496), OCT(573), NOV(662), DEC(157) కేసులను వేరే ఆసుపత్రులకు రెఫర్ చేశారు.
News December 17, 2025
గోవా నుంచి తిరుపతికి.. అక్కడ నుంచి నెల్లూరుకి..

నెల్లూరు కార్పొరేషన్కి చెందిన 40 మంది కార్పొరేటర్లు కుటుంబ సభ్యులతో గోవాలో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. వారు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు గోవా నుంచి తిరుపతికి రానున్నారు. అక్కడి నుంచి రేపు ఉదయం నేరుగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుంటారు. రేపు కార్పొరేషన్ ఆఫీస్లో సమావేశం ఉంటుంది. ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మేయర్ రాజీనామాకు ఆమోదం తెలపనున్నారు.
News December 17, 2025
లింగసముద్రం: గుండెపోటుతో హోంగార్డు మృతి

లింగసముద్రం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న కొండలరావు గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం రాత్రి బైక్పై విధి నిర్వహణకు పోలీస్ స్టేషన్కు వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన అకాల మరణంతో కుటుంబ సభ్యులు, సహచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


