News October 11, 2024

సిరాజ్‌కు DSP పోస్ట్

image

TG: టీమ్ ఇండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం కల్పించింది. ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని డీజీపీ జితేందర్ ఆయనకు అందించారు. కాగా గతంలోనే సిరాజ్‌కు గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News

News December 3, 2025

నేటి నుంచి మూడో విడత నామినేషన్లు

image

TG: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. మూడో విడతలో 4,159 సర్పంచ్, 36,452 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 5 వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. DEC 9 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అటు రెండో విడత నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది. మూడో విడతకు డిసెంబర్ 17న పోలింగ్ జరగనుంది.

News December 3, 2025

14,967 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్

image

దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS)లో ఖాళీగా ఉన్న 14,967 పోస్టుల దరఖాస్తు గడువు DEC 4తో ముగియనుంది. అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, టీచర్లు, లైబ్రేరియన్ వంటి పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, ME, M.Tech, BCA, BE, B.Tech, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు <>అప్లై<<>> చేసుకోవచ్చు.

News December 3, 2025

రొయ్యల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం నిర్లక్ష్యం వద్దు

image

రొయ్యల్లో వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. అందుకే చెరువులోని రొయ్యల్లో కనిపించే కొన్ని లక్షణాలను రైతులు నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు ఆక్వా నిపుణులు. రొయ్యలు ఆహారం తీసుకోవడం ఆకస్మికంగా తగ్గించినా, బలహీనంగా కనిపిస్తూ నీటి ఉపరితలంపై ఎక్కువ సమయం ఈదుతున్నా, రొయ్య ఎర్రగా కనిపిస్తూ, గుల్ల వదులుగా ఉన్నా, అకస్మాత్తుగా ఎక్కువ రొయ్యల మరణాలు కనిపిస్తే ఆక్వా రైతులు వెంటనే అప్రమత్తమై నిపుణుల సూచనలు తీసుకోవాలి.