News April 24, 2024
గోవాలో డ్యుయల్ సిటిజన్షిప్ డిమాండ్ – 1/3

ఎన్నికల వేళ గోవా ప్రజలకు డ్యుయల్ సిటిజన్షిప్కు అనుమతించాలన్న డిమాండ్ మరోసారి చర్చనీయాంశమైంది. 1961లో గోవాను వీడుతూ పోర్చుగల్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు ఆఫర్ ఇచ్చింది. 1961 డిసెంబరు 19కి ముందు పుట్టిన వారు సహా మరో రెండు భవిష్యత్ తరాల వారు పోర్చుగల్ పౌరసత్వం పొందేందుకు అవకాశం కల్పించింది. దీంతో చాలా మంది గోవా ప్రజలు పోర్చుగల్ పౌరసత్వం కోసం అక్కడ పుట్టినట్లు నమోదు చేసుకున్నారు. <<-se>>#Elections2024<<>>
Similar News
News January 18, 2026
మీ ఇంట్లో సూర్యుడి విగ్రహం ఉందా?

చాలామంది ఇళ్లల్లో దేవుళ్ల విగ్రహాలు ఉంటాయి. కానీ సూర్యుడి విగ్రహాన్ని మాత్రం పెట్టుకోకూడదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే సూర్యుడు మనకు రోజూ ప్రత్యక్ష దైవంగా కనిపిస్తాడు. ఉదయాన్నే సూర్యోదయ సమయంలో ఆ భాస్కరుడిని చూస్తూ నమస్కరించుకోవడం, అర్ఘ్యం వదలడం శ్రేష్ఠం. ప్రకృతిలోనే దైవాన్ని దర్శించుకునే అవకాశం ఉన్నప్పుడు, విగ్రహ రూపం కంటే నేరుగా సూర్యుడిని ఆరాధించడమే అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది.
News January 18, 2026
బిడ్డ ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే?

ప్రెగ్నెన్సీలో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి పీచు ఎక్కువగా ఉండే పప్పులు, బీన్స్, బఠానీ, బెర్రీ పండ్లు, నట్స్, డ్రైఫ్రూట్స్తీసుకోవాలి. కాల్షియం కోసం పాలు, పాల పదార్థాలు, ఆకుకూరలు, గుడ్లు, సపోటా, చేపలు తీసుకోవాలి. ఐరన్ లోపం రాకుండా ఆప్రికాట్స్, కోడిగుడ్లలోని పచ్చసొన, చేపలు, డ్రైఫ్రూట్స్, ఆకుకూరలు, ఆకుపచ్చటి కాయగూరలు, ఓట్స్, చిరుధాన్యాలు, గోధుమలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News January 18, 2026
హైదరాబాద్లో 248పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<


