News April 9, 2025
దుబాయ్ టు ముంబై.. సముద్రంలో బుల్లెట్ ట్రైన్!

దుబాయ్ నుంచి ముంబైకి అండర్ వాటర్ బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు యూఏఈకి చెందిన నేషనల్ అడ్వైజర్ బ్యూరో లిమిటెడ్ ప్లాన్ చేస్తోంది. దీని సాధ్యాసాధ్యాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. హైపర్‌లూప్ వంటి లేటెస్ట్ టెక్నాలజీతో అరేబియన్ సముద్రంలో అల్ట్రా-హై స్పీడ్ ట్రైన్ రానున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా దుబాయ్-ముంబై మధ్య 2వేల కి.మీ దూరాన్ని 2 గంటల్లో చేరుకోవచ్చు.
Similar News
News October 28, 2025
అమెజాన్‌లో 30వేల ఉద్యోగాల తొలగింపు?

అమెజాన్ కంపెనీ 30వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. ఇవాళ్టి నుంచి లేఆఫ్స్‌ను ప్రకటించే అవకాశం ఉందని పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కార్పొరేట్ వర్క్ ఫోర్స్ నుంచి ఈ తొలగింపులు ఉండనున్నట్లు పేర్కొన్నాయి. వరల్డ్ వైడ్‌గా అమెజాన్ 1.54 మిలియన్ ఉద్యోగులను కలిగి ఉంది. ఇందులో కార్పొరేట్ ఎంప్లాయిస్ 3,50,000 మంది ఉంటారని అంచనా.
News October 28, 2025
LRS గడువు పొడిగింపు

AP: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(LRS) దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించింది. తొలుత ప్రకటించిన గడువు ఈనెల 23తో ముగియగా, వచ్చే ఏడాది జనవరి 23వ తేదీ వరకు గడువును పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత 3 నెలల్లో 40వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
News October 28, 2025
PKL: నేడు తెలుగు టైటాన్స్‌కు చావో రేవో

ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12లో ఇవాళ తెలుగు టైటాన్స్, పట్నా పైరేట్స్ మధ్య ఎలిమినేటర్-3 మ్యాచ్ జరగనుంది. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు రేపు క్వాలిఫయర్-2లో పుణేరి పల్టాన్‌తో తలపడనుంది. కాగా నిన్న జరిగిన క్వాలిఫయర్-1లో పుణెరి పల్టాన్‌పై గెలిచిన దబాంగ్ ఢిల్లీ ఫైనల్‌కు చేరింది. కాగా సూపర్ ఫామ్‌లో ఉన్న తెలుగు టైటాన్స్ ఈ సీజన్లోనైనా విజేతగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


