News March 29, 2024
డకౌట్ అయినా అలాగే ఉంటా: రియాన్ పరాగ్

ఢిల్లీతో మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన రాజస్థాన్ ప్లేయర్ రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం తనకు అలవాటైపోయిందన్నారు. డకౌట్ అయినా అలాగే ఉంటానని చెప్పారు. గత నాలుగేళ్లుగా తన కష్టాలను అమ్మ ప్రత్యక్షంగా చూశారన్నారు. తొలి మ్యాచ్కు ముందు మూడు రోజులు బెడ్పైనే ఉన్నానని తెలిపారు. నిన్నటి మ్యాచ్ కోసం చాలా కష్టపడ్డానని.. ఫలితం అందుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
Similar News
News January 14, 2026
మరో 9 అమృత్ భారత్ రైళ్లు.. ఏపీ మీదుగా వెళ్లేవి ఎన్నంటే?

కేంద్ర ప్రభుత్వం కొత్తగా 9 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో నాలుగు రైళ్లు పశ్చిమ బెంగాల్ నుంచి ఏపీ మీదుగా తమిళనాడు, బెంగళూరు వరకు పరుగులు తీయనున్నాయి. ఖరగ్పూర్, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన స్టేషన్లకు ఈ రైళ్లు కనెక్టివిటీని పెంచనున్నాయి. ఈ ట్రైన్లలో న్యూ జల్పాయ్గురి నుంచి తిరుచిరాపల్లి వెళ్లే రైలు దేశంలోనే అతి పొడవైన రూట్లలో ఒకటిగా నిలవనుంది.
News January 14, 2026
జనవరి 14: చరిత్రలో ఈరోజు

1896: భారత ఆర్థికవేత్త సి.డి.దేశ్ముఖ్ జననం
1937: సినీ నటుడు రావు గోపాలరావు జననం
1937: సినీ నటుడు శోభన్ బాబు జననం(ఫొటో-R)
1951: సినీ దర్శకుడు జంధ్యాల జననం(ఫొటో-L)
1979: కవి కేసనపల్లి లక్ష్మణకవి మరణం
News January 14, 2026
సంక్రాంతి ప్రతిసారి ఒకే తేదీన ఎందుకు వస్తుంది?

దాదాపు మన పండుగలన్నీ చంద్రుని గమనం ఆధారంగా వస్తుంటాయి. అందుకే క్యాలెండర్లో ఆ పండుగల తేదీలు మారుతుంటాయి. కానీ సంక్రాంతి సూర్యుని గమనం ఆధారంగా జరుపుకుంటాం. సూర్యుడు ప్రతి ఏడాది ఒకే సమయంలోమకర రాశిలోకి ప్రవేశిస్తాడు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే ఈ కాలం స్థిరంగా ఉంటుంది. అందుకే JAN 14/15 తేదీలలోనే సంక్రాంతి వస్తుంది. ఇది ఖగోళ మార్పులకు సంబంధించిన పండుగ కాబట్టి తేదీల్లో మార్పు ఉండదు.


