News August 14, 2024

జగన్ తప్పిదాలతోనే ఆరోగ్యశ్రీ బకాయిలు: మంత్రి సత్యకుమార్

image

AP: ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో పాలన గాడిలో పడుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. జగన్ తప్పిదాలతోనే ఆరోగ్యశ్రీ నిధులు బకాయిలు పడ్డాయని విమర్శించారు. తాము 2 నెలల్లోనే ఆస్పత్రులకు బకాయిలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కోల్‌కతాలో డాక్టర్ హత్య ఘటనను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్యుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Similar News

News November 25, 2025

300 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(OICL) 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. జనవరి 10న టైర్ 1ఎగ్జామ్, ఫిబ్రవరి 25న టైర్ 2 ఎగ్జామ్ నిర్వహించనున్నారు. విద్యార్హతలు, వయసు తదితర వివరాలు పూర్తి స్థాయి నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు. వెబ్‌సైట్: https://orientalinsurance.org.in

News November 25, 2025

రాష్ట్రంలో 3 కొత్త జిల్లాలు

image

AP: రాష్ట్రంలో మరో మూడు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం (రంపచోడవరం కేంద్రం) జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా అద్దంకి, పీలేరు, బనగానపల్లె, మడకశిర, నక్కపల్లి రెవెన్యూ డివిజన్లకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.

News November 25, 2025

STRANGE: ఈ ఆలయం గురించి తెలుసా?

image

అభిమాన హీరోలకు గుడులు కట్టడం చూస్తుంటాం. అయితే బైక్‌కు గుడి కట్టి పూజించే ఆలయం ఒకటుంది. బుల్లెట్ బాబా ఆలయం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్-పాలీ హైవేపై ఉంది. ఇక్కడ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్(RNJ 7773) బైక్‌ను దేవుడిగా పూజిస్తారు. 1988లో యాక్సిడెంట్‌లో ఓం సింగ్ చనిపోగా.. బైక్‌ను వేరే చోటుకు తీసుకెళ్లినా మళ్లీ అక్కడికే వచ్చింది. సురక్షిత ప్రయాణం కోసం ఈ బైక్‌ను పూజిస్తారు. దీనిపై ‘DUG DUG’ అనే మూవీ వచ్చింది.