News August 30, 2024
జగన్ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టులకు గండ్లు: మంత్రి నిమ్మల

AP: కృష్ణా నదికి వరద పోటెత్తడంతో సాగర్ కుడికాలువ ఆయకట్టుకు 15రోజుల ముందుగానే సాగునీరు విడుదల చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇరిగేషన్ అధికారులతో సమీక్షలో ఆయన మాట్లాడారు. ‘జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టులకు గండ్లు పడుతున్నాయి. చింతలపూడి పథకాన్ని పట్టించుకోలేదు. ఇది పూర్తయితే ప.గో, కృష్ణా జిల్లాల్లోని 4.80లక్షల ఎకరాలకు సాగునీరు, 26లక్షల మందికి తాగునీరు అందుతుంది’ అని చెప్పారు.
Similar News
News December 4, 2025
ఇతిహాసాలు క్విజ్ – 86

ఈరోజు ప్రశ్న: పార్వతీ దేవి అవతారంగా, శక్తి స్వరూపిణిగా, విష్ణుమూర్తి సోదరిగా పరిగణించబడే, ఈశ్వరుడు వివాహం చేసుకున్న దేవత ఎవరు? అలాగే, ఆమెకు తమిళనాడులో ఒక ప్రసిద్ధ ఆలయం కూడా ఉంది. ఆమెతో పాటు ఒక పచ్చ చిలుక కూడా కనిపిస్తుంది.
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం. ☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 4, 2025
పంట వ్యర్థాలను కలియదున్నితే కలదు లాభం

పంటకాలం పూర్తయ్యాక వ్యర్థాలను నేలలో కలియదున్నడం వల్ల సేంద్రీయ కర్బనశాతం పెరుగుతుంది. తర్వాతి పంట దిగుబడులు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశముంది. వ్యర్థాలను దుక్కి దున్నే సమయంలో నిపుణుల సూచనతో భూమిలో సూపర్ ఫాస్పెట్ చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా మారతాయి. ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది. పచ్చిరొట్టను కలియదున్నితే తర్వాత వేసే పంటకు అది ఎరువుగా మారి మంచి దిగుబడులు వస్తాయి.
News December 4, 2025
1,213 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

వెస్ట్రన్ కోల్ఫీల్డ్లో 1,213 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. బీటెక్, BE, డిప్లొమా, ITI, టెన్త్ అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 26ఏళ్ల మధ్య ఉండాలి. గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్లు NATS పోర్టల్లో, ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్లు NAPS పోర్టల్లో ఎన్రోల్ చేసుకోవాలి. ఎంపికైన అప్రెంటిస్లకు ప్రతి నెల స్టైపెండ్ చెల్లిస్తారు. <


