News September 30, 2024

లాక్‌డౌన్ వల్ల చంద్రుడిపై ఉష్ణోగ్రత తగ్గుదల!

image

కొవిడ్ లాక్‌డౌన్ కారణంగా చంద్రుడిపై ఉష్ణోగ్రతలు తగ్గాయని భారత పరిశోధకుల అధ్యయనంలో తేలింది. వారి నివేదిక ప్రకారం.. 2017-23 మధ్యకాలంలో చంద్రుడిపై 6 వివిధ ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతల్ని నాసా ఆర్బిటర్ డేటా సాయంతో స్టడీ చేశారు. ఈక్రమంలో లాక్‌డౌన్ కాలంలో చందమామపై టెంపరేచర్ గణనీయంగా తగ్గిందని గుర్తించారు. కాలుష్యం తగ్గడంతో భూమి నుంచి వెలువడే రేడియేషన్ కూడా తగ్గడమే దీనికి కారణం కావొచ్చని వారు అంచనా వేశారు.

Similar News

News October 1, 2024

ఎంపీ అనిల్‌కు హరీశ్ రావు లీగల్ నోటీసులు

image

TG: కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు లీగల్ నోటీసులు పంపారు. తనపై ఎంపీ అనిల్ అసత్య ఆరోపణలు చేశారని, ఇందుకు సంబంధించిన ట్వీట్‌ను జతచేస్తూ నోటీసులు పంపారు. హిమాయత్ సాగర్ FTL భూముల్లో అక్రమంగా నిర్మించిన ఆనంద కన్వెన్షన్‌లో హరీశ్ రావుకు వాటాలున్నాయని అనిల్ ఆరోపించారు.

News October 1, 2024

టీమ్ ఇండియా రికార్డుల విధ్వంసం

image

బంగ్లాతో రెండో టెస్టులో టీమ్ ఇండియా రికార్డుల విధ్వంసం సృష్టించింది. అవి.. టెస్టుల్లో జట్టు స్కోర్లలో అత్యంత వేగంగా 50, 100, 150, 200, 250 రన్స్. తొలి 3 ఓవర్లలోనే స్కోరు 50 దాటించిన ఏకైక జట్టు. కనీసం 200 బంతులు ఆడిన ఇన్నింగ్స్‌లలో అత్యధిక రన్‌రేట్(8.22). పురుషుల క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన 50+ భాగస్వామ్యం(రోహిత్-జైస్వాల్: 23 బంతుల్లో 55). టెస్టుల్లో ఒక ఏడాదిలో అత్యధిక సిక్సులు(96).

News October 1, 2024

ఎన్టీఆర్-ప్రశాంత్ ప్రాజెక్టుపై ఇంట్రెస్టింగ్ న్యూస్!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న యాక్షన్ ఫిల్మ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రం బంగ్లాదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. హీరోయిన్‌గా రష్మిక నటించనున్నారని, ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ హైలైట్‌గా నిలిచేలా కథ ఉంటుందని తెలుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.