News August 1, 2024
ప్రైవేట్ ఏజెన్సీల బకాయిలు రూ.1025 కోట్లు: సీఎంతో అధికారులు

AP: ఉచిత ఇసుక విధానంలో వినియోగదారులకు భారం లేకుండా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మైనింగ్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. గత ఐదేళ్లలో మైనింగ్ శాఖపై 7 శాతం ఆదాయమే వచ్చినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీలు చెల్లింపులు చేయలేదన్నారు. ప్రభుత్వానికి రూ.1025 కోట్లు చెల్లించలేదని తేల్చారు. ఈ అక్రమాలపై కేసులు నమోదు చేసినట్లు సీఎంకు అధికారులు వివరించారు.
Similar News
News November 28, 2025
గంభీర్పై తివారీ ఘాటు వ్యాఖ్యలు

SAతో స్వదేశంలో టెస్ట్ సిరీస్లో 0-2తో ఓటమి తరువాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు పెరుగుతున్నాయి. ఆయనను వెంటనే తొలగించాలంటూ మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ డిమాండ్ చేశారు. గంభీర్ తప్పుడు వ్యూహాలు, జట్టులో అతి మార్పులే ఈ పరాజయానికి కారణమని ఆరోపించారు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ విజయాలకు రోహిత్ శర్మ, ద్రవిడ్, కోహ్లీ నిర్మించిన జట్టే కారణమని, గంభీర్ ప్రభావం లేదని తివారీ పేర్కొన్నారు.
News November 28, 2025
బాపట్ల DWCWEOలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

AP: బాపట్లలోని డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్& ఎంపవర్మెంట్ ఆఫీస్ (DWCWEO)లో 8 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్, ఇంటర్, బీఏ(సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్సెస్), డిగ్రీ, బీఈడీ, 7వ తరగతి అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25-42ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: https://bapatla.ap.gov.in/
News November 28, 2025
పవన్ రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి!

AP: పవన్ రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి కదలికలపై Dy.CM కార్యాలయం పోలీసులకు సమాచారమిచ్చింది. ‘శంకరగుప్తం డ్రెయిన్ మూలంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలు పరిశీలిస్తున్నప్పుడు, అధికారులతో సంభాషిస్తున్నప్పుడు, ఆ తర్వాత కార్యక్రమాల్లోనూ ఆ వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి సమీపంలో సంచరించారు. అతను రాజోలు నియోజకవర్గ YCP కార్యకర్తగా సమాచారమందింది. ఈ విషయాన్ని కోనసీమ జిల్లా SP దృష్టికి తీసుకెళ్లాం’ అని తెలిపింది.


