News April 19, 2024

చేనేత కార్మికులకు రూ.50 కోట్ల బకాయిలు విడుదల

image

TG: చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత ఏడాది బతుకమ్మ చీరలు తయారుచేసిన నేతన్నలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.351 కోట్లు ఉండగా, అందులో రూ.50 కోట్లు విడుదల చేసింది. ఆర్థిక వెసులుబాటును బట్టి మిగతా మొత్తాన్ని త్వరగా అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో వేలాది మంది కార్మికులకు ఊరట కలగనుంది.

Similar News

News December 6, 2025

సైబర్ మోసాల నుంచి రక్షణకు గూగుల్ కొత్త ఫీచర్

image

సైబర్ మోసాల బారిన పడి రోజూ అనేకమంది ₹లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఎక్కువగా మొబైల్ యూజర్లు నష్టపోతున్నారు. దీనినుంచి రక్షణకు GOOGLE ఆండ్రాయిడ్ ఫోన్లలో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ‘ఇన్-కాల్ స్కామ్ ప్రొటెక్షన్’ అనే ఈ ఫీచర్ ఆర్థిక లావాదేవీల యాప్‌లు తెరిచినప్పుడు, సేవ్ చేయని నంబర్ల కాల్స్ సమయంలో పనిచేస్తుంది. మోసపూరితమైతే స్క్రీన్‌పై హెచ్చరిస్తుంది. దీంతో కాల్ కట్ చేసి మోసం నుంచి బయటపడే అవకాశముంది.

News December 6, 2025

ఫిట్‌నెట్ సాధించిన గిల్.. టీ20లకు లైన్ క్లియర్!

image

IND టెస్ట్&ODI కెప్టెన్ గిల్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారు. అతడికి BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. దీంతో ఈ నెల 9 నుంచి SAతో జరిగే T20 సిరీస్‌కు ఆయన పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొన్నాయి. SAతో తొలి టెస్టులో గాయపడి రెండో టెస్టు, ODIలకు గిల్ దూరమయ్యారు. ఫిట్‌నెస్‌ ఆధారంగా గిల్ <<18459762>>T20ల్లో<<>> ఆడతారని BCCI పేర్కొన్న సంగతి తెలిసిందే.

News December 6, 2025

‘రీపర్ హార్వెస్టర్’తో పంట కోత మరింత సులభం

image

వ్యవసాయంలో యాంత్రీకరణ అన్నదాతకు ఎంతో మేలు చేస్తోంది. పంట కోత సమయంలో కూలీల కొరతను అధిగమించడానికి మార్కెట్‌లో అనేక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి ‘రీపర్ హార్వెస్టర్’. ఈ యంత్రంతో వరి, గోధుమ, సోయాబీన్ ఇతర ధాన్యాల పంటలను సులభంగా కోయవచ్చు. డైరీ ఫామ్ నిర్వాహకులు కూడా సూపర్ నేపియర్ గడ్డిని కట్ చేయడానికి ఈ యంత్రం ఉపయోగపడుతుంది. వీటిలో కొన్ని ధాన్యాన్ని కోసి కట్టలుగా కూడా కడతాయి.