News September 5, 2024

దులీప్ ట్రోఫీ: కిషన్, సూర్య దూరం.. సంజూకు ఛాన్స్

image

దులీప్ ట్రోఫీ స్క్వాడ్‌లో బీసీసీఐ మార్పులు చేసింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ గాయాల కారణంగా తొలి రౌండ్ నుంచి వైదొలిగినట్లు వెల్లడించింది. కిషన్ స్థానంలో సంజూ శాంసన్‌ను ఇండియా-డి జట్టుకు ఎంపిక చేసింది. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఫిట్‌నెస్ క్లియర్ చేసుకుని సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. 4 <>జట్లు<<>> పాల్గొనే ఈ టోర్నీ ఇవాళ ప్రారంభం కానుంది.

Similar News

News February 17, 2026

ఇక MPTC, ZPTC ఎన్నికలపై ఫోకస్!

image

TG: పంచాయతీ, మున్సిపల్ పోరు ముగియడంతో ఇక MPTC, ZPTC ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇవాళ అధికారులతో CM రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ తర్వాత పోల్స్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలని, 15-20 రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్, <<19148172>>ఇంటర్<<>>, టెన్త్ పరీక్షలకు తగ్గట్లుగా ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారు.

News February 17, 2026

హార్దిక్ పాండ్య ‘రుద్ర’ వాచ్ గురించి తెలుసా?

image

శివరాత్రి రోజున <<19153355>>పాక్‌తో జరిగిన<<>> మ్యాచ్‌లో భారత ప్లేయర్ హార్దిక్ పాండ్య ధరించిన వాచ్‌పై నెట్టింట చర్చ జరుగుతోంది. జాకబ్ అండ్ కో సంస్థ ‘రుద్ర’ పేరుతో వీటిని తయారు చేస్తోంది. ఒక్కోటి రూ.25 లక్షల వరకు ఉంటుందని, ప్రపంచంలో 25 పీసులే ఉన్నాయని తెలుస్తోంది. వాచ్ డిస్‌ప్లేపై ధ్యానంలో ఉన్న శివుడు, ఓం, గుడి చిత్రాలున్నాయి. 41 MM గ్రేడ్ 5 టైటానియం కేస్‌తో ఇది తయారైంది. 70 గంటలపాటు పవర్ రిజర్వ్ ఉంటుంది.

News February 17, 2026

నేటితో శుక్ర మౌఢ్యమి ముగింపు

image

గతేడాది నవంబర్ 26వ తేదీన మొదలైన శుక్ర మౌఢ్యమి నేటితో ముగియనుంది. ఇన్నాళ్లూ అస్తమయ స్థితిలో ఉన్న శుక్రుడు రేపటి నుంచి తిరిగి శుభప్రదమైన స్థితిలోకి వస్తాడు. దీంతో నిలిచిపోయిన శుభ కార్యాలు రేపటి నుంచి మళ్లీ మొదలవుతాయి. వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు వంటి విలువైన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా, నిశ్చింతగా నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.