News July 4, 2024
డంక్డ్ రైస్ కేక్.. అంటే ఇడ్లీ: హర్ష గొయొంక పోస్ట్ వైరల్
విదేశాల్లోని రెస్టారెంట్లలో భారతీయ వంటకాల పేర్ల చూసి పారిశ్రామికవేత్త హర్ష గొయొంక అవాక్కయ్యారు. ఆయన వెళ్లిన హోటల్‌లో సాంబార్ వడ పేరును ‘డంక్డ్ డోనట్’, ఇడ్లీని ‘డంక్డ్ రైస్ కేక్’, దోశను ‘నేకెడ్ క్రీప్’గా మార్చేశారు. ‘వడ, ఇడ్లీ, దోశలు ఇంత ఫ్యాన్సీగా మారుతాయని ఎవరికి తెలుసు’ అని ఆయన ఫన్నీ ట్వీట్ చేశారు. కాగా ప్లేట్ సాంబార్ వడ ధర రూ.1300, ఇడ్లీ రూ.1200 ఉండటం చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
Similar News
News January 16, 2025
నేడు ఈడీ విచారణకు కేటీఆర్
TG: ఫార్ములా-ఈ కారు రేసులో మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉ.10.30 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ నెల 7నే విచారణకు హాజరుకావాల్సి ఉండగా క్వాష్ పిటిషన్ విచారణ నేపథ్యంలో గడువు కోరడంతో నేడు రావాలని నోటిసులిచ్చింది. ఇప్పటికే ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది. దీంతో ఇవాళ జరిగే పరిణామాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
News January 16, 2025
ఖో ఖో వరల్డ్ కప్: క్వార్టర్ ఫైనల్‌కు భారత్
ఖో ఖో వరల్డ్ కప్‌లో భారత పురుషుల జట్టు వరుసగా 3 మ్యాచుల్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరింది. నిన్న పెరూతో జరిగిన మ్యాచులో 70-38 తేడాతో గెలుపొందింది. మ్యాచ్ మొత్తం ప్రత్యర్థిపై ఆధిపత్యం కొనసాగించింది. మరోవైపు మహిళల జట్టు ఇరాన్‌పై ఘన విజయం సాధించింది. 100-16 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇవాళ పురుషుల జట్టు భూటాన్‌తో, మహిళల జట్టు మలేషియాతో పోటీ పడనున్నాయి.
News January 16, 2025
తిరుమలలో విషాదం.. మూడేళ్ల బాలుడి మృతి
AP: తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. బస్టాండ్ సమీపంలో పద్మనాభ నిలయం భవనంపై రెండో అంతస్తు నుంచి కింద పడి మూడేళ్ల బాలుడు మరణించాడు. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్వామివారి దర్శనం కోసం కడపకు చెందిన శ్రీనివాసులు ఫ్యామిలీతో తిరుమలలోని పద్మనాభ నిలయానికి వచ్చారు. అతని రెండో కుమారుడు సాత్విక్(3) ఆడుకుంటూ వెళ్లి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మరణించాడు.