News April 24, 2024
డూప్‌లకు ఫుల్ డిమాండ్

ఎన్నికల వేళ డూప్‌లకు డిమాండ్ ఏర్పడింది. వారితో ప్రచారం చేయించేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మోదీని పోలిన వికాస్, యోగీని పోలిన జగదీశ్, మరో మమతను తలపిస్తున్న రూమాల షెడ్యూల్ ప్రస్తుతం బిజీగా ఉండటం విశేషం. ప్రచారానికి రమ్మని అనేక మంది కోరుతున్నట్లు వారు చెబుతున్నారు. వీరేకాక సెలబ్రిటీలను పోలిన డూప్‌లను కూడా ప్రచారంలో దింపుతున్నారు. ఇటీవల షోలాపూర్‌లో కాంగ్రెస్ తరఫున షారుఖ్ డూప్ ప్రచారం చేశారు.
Similar News
News December 4, 2025
ఈ బౌలింగ్, ఫీల్డింగ్‌తో వరల్డ్ కప్ నెగ్గగలమా?

వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే జట్టు అన్ని విభాగాల్లో టాప్ క్లాస్‌లో ఉండాలి. ప్రస్తుతం IND బౌలింగ్, ఫీల్డింగ్ చూస్తే WC గెలవడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. SAతో 2వ వన్డేలో 350+స్కోర్ చేసినా బౌలర్లు పోరాడలేదు. తొలి వన్డేలోనూ తేలిపోయారు. ఫీల్డింగ్‌లోనూ లోపాలు కనిపించాయి. WC-2027కు ముందు భారత్ 20 వన్డేలే ఆడనుంది. అప్పట్లోగా ఈ 2 విభాగాల్లో మెరుగవ్వకుంటే WC మరోసారి కలగానే మిగిలే ప్రమాదం ఉంది.
News December 4, 2025
27 ఎకరాలకు రూ.3,708 కోట్ల ఆదాయం

HYDలో భూమి బంగారమైందంటే ఇదేనేమో. కోకాపేట నియోపొలిస్‌లో ప్రభుత్వం 27 ఎకరాలు విక్రయిస్తే ఏకంగా రూ.3,708 కోట్ల ఆదాయం వచ్చింది. ఇవాళ మూడో విడత వేలంలో ప్లాట్ నంబర్ 19లో ఎకరం రూ.131 కోట్లు, 20లో ఎకరం రూ.118 కోట్లు పలికింది. మొత్తం 8.04 ఎకరాలను వేలం వేయగా HMDAకు రూ.వెయ్యి కోట్ల ఆదాయం లభించింది. అంతకుముందు రెండు వేలం పాటల్లో రూ.2,700 కోట్లు వచ్చాయి. రికార్డు స్థాయిలో ఎకరం రూ.150 కోట్లకు పైగా పలికింది.
News December 4, 2025
భారత్ ఓటమికి కారణమిదే..

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ <<18462441>>ఓటమికి<<>> చెత్త ఫీల్డింగ్, పేలవ బౌలింగే కారణం. మార్క్రమ్ క్యాచ్‌ను జైస్వాల్ వదిలేయడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అతడు సెంచరీతో చెలరేగాడు. ప్రసిద్ధ్ 8.2 ఓవర్లకు 82, కుల్దీప్ 10 ఓవర్లకు 78, హర్షిత్ 10 ఓవర్లకు 70 రన్స్ సమర్పించుకోవడం భారత్‌కు విజయాన్ని దూరం చేసింది. ఇక ఇలాంటి ఫీల్డింగ్‌తో 400 కొట్టినా కాపాడుకోలేమని క్రికెట్ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.


