News September 24, 2025

అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ.. ఏ మంత్రం పఠించాలంటే!

image

శరన్నవరాత్రి మహోత్సవాలలో మూడో రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు. ఇవాళ ‘నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్థూతాఖిల లోకపావనకరీ ప్రత్యేక్ష మాహేశ్వరీ| ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి! కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ॥’ అనే మంత్రాన్ని పఠించాలి. నేడు అమ్మవారిని దర్శించుకుంటే అన్నాదులకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు.

Similar News

News September 24, 2025

చంద్రబాబు ప్రభుత్వం చేయకూడని పనులన్నీ చేస్తోంది: జగన్

image

AP: కూటమి ప్రభుత్వంపై 15 నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని YCP అధినేత జగన్ అన్నారు. ‘చంద్రబాబు ప్రభుత్వం చేయకూడని పనులన్నీ చేస్తోంది. సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయినా బలవంతపు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ స్థాయిలో మోసం చేసేవారు ఎవరూ ఉండరు. YCP హయాంలో ఇలాంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో యూరియా దొరకట్లేదు. ప్రభుత్వం దళారులతో చేతులు కలిపి యూరియాను పక్కదారి పట్టిస్తోంది’ అని పార్టీ సమావేశంలో ఆరోపించారు.

News September 24, 2025

రూ.100 లంచం ఆరోపణ.. 39 ఏళ్ల న్యాయ పోరాటం

image

ఓ తప్పుడు ఆరోపణ రాయ్‌పుర్‌కు చెందిన జగేశ్వర్ ప్రసాద్(83) జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేసింది. MPSRTCలో బిల్లింగ్ అసిస్టెంట్‌ జగేశ్వర్‌ను సహోద్యోగి 1986లో లంచం కేసులో ఇరికించాడు. 1988-1994 వరకు సస్పెన్షన్, తర్వాత సగం జీతంతో బదిలీ చేశారు. ప్రమోషన్, ఇంక్రిమెంట్ లేదు. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఆ ఒత్తిడితో భార్య చనిపోయింది. ఆఖరికి 39 ఏళ్ల తర్వాత హైకోర్టు ఆయన్ను నిర్దోషిగా తేల్చింది.

News September 24, 2025

ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు!

image

AP: మన్యం, VZM, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో రాత్రి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఈ నెల 26న వాయవ్య-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుందని తెలిపింది. అది 27న దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే ఛాన్సుందని తెలిపింది. ఈ సందర్భంగా కోస్తా జిల్లాల్లో 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది.