News July 7, 2025
దుర్గమ్మ అంతరాలయ, VIP దర్శనాలు నిలిపివేత

AP: ఈనెల 8-10 వరకు విజయవాడ దుర్గమ్మ అంతరాలయ, VIP దర్శనాలను నిలిపేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. శాకంబరీ ఉత్సవాలు, ఆషాఢ సారె సమర్పణ సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. తూ.గో, ప.గో, కృష్ణ, గుంటూరు జిల్లాల రైతులు, వ్యాపారులు అమ్మవారి అలంకరణకు 150టన్నుల కూరగాయలు, 50టన్నుల పండ్లు స్వచ్ఛందంగా అందజేశారు.
Similar News
News July 8, 2025
ట్రంప్ టారిఫ్స్ లేఖలు: మొదట ఈ దేశాలకే..

US ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్స్ వడ్డన మొదలుపెట్టారు. ఈ మేరకు ఆయా దేశాలకు అధికారికంగా లేఖలు పంపుతున్నారు. మొదటగా జపాన్, సౌత్ కొరియాలకు 25% టారిఫ్స్ విధించారు. జపాన్ PM ఇషిబా, సౌత్ కొరియా ప్రెసిడెంట్ లీ జేకు పంపిన లేఖలను ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘ఇది చాలా తక్కువ’ అని పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి టారిఫ్స్ అమల్లోకి వస్తాయన్నారు. దీంతో తర్వాత ఏయే కంట్రీస్‌కు ఎంత విధిస్తారో అన్న ఆందోళన మొదలైంది.
News July 8, 2025
పదవి పోయిన గంటల్లోనే మాజీ మంత్రి మృతి

రష్యా రవాణా శాఖ మాజీ మంత్రి రోమన్ స్తారోవోయిత్(53) అనుమానాస్పద స్థితిలో మరణించారు. రోమన్‌ను అధ్యక్షుడు పుతిన్ పదవి నుంచి తొలగించిన గంటల్లోనే తన కారులో శవమై కనిపించారు. గన్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారని వార్తలొచ్చాయి. కాగా ఇటీవల ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో వందలాది విమానాలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ కారణంతోనే రోమన్‌పై వేటు వేసినట్లు తెలుస్తోంది.
News July 7, 2025
రేపు శ్రీశైలంలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే

AP: CM చంద్రబాబు శ్రీశైలం పర్యటన షెడ్యూల్ విడుదలైంది. రేపు ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. 11గం.లకు శ్రీశైలం చేరుకుని మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12గం.కు శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చేరుకొని కృష్ణమ్మకు జలహారతి ఇస్తారు. గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటి విడుదలను ప్రారంభిస్తారు. అనంతరం నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతారు. మ.2.30కి అమరావతికి వెళ్తారు.