News April 27, 2024
దుర్గమ్మ ఆశీస్సులు ఎవరికో!

ప్రముఖ పుణ్యక్షేత్రం దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉంది. ఇది బంగారం, హోల్‌సేల్ వ్యాపారాలతో వాణిజ్యానికి ప్రధాన కేంద్రం. కాంగ్రెస్ 6, CPI 5 సార్లు, YCP 2 సార్లు, TDP ఒకసారి గెలిచింది. ఇక్కడ ఒకసారి గెలిచిన వ్యక్తి వరుసగా మరోసారి గెలవలేదు. కాగా హ్యాట్రిక్‌పై గురి పెట్టిన YCP ఈసారి షేక్ ఆసిఫ్‌ను బరిలోకి దింపింది. BJP తరఫున పారిశ్రామిక వేత్త సుజనా చౌదరి బరిలో నిలిచారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News November 14, 2025
చిరాగ్ పాస్వాన్: పడి లేచిన కెరటం!

సరిగ్గా ఐదేళ్ల కిందట దారుణ పరాజయాన్ని చవిచూశారు LJP అధినేత చిరాగ్ పాస్వాన్. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 130కి పైగా సీట్లలో పోటీ చేసి కేవలం ఒకేఒక స్థానంలో గెలిచారు. బాబాయ్‌తో వివాదాలు, 2021లో పార్టీలో చీలిక తర్వాత తట్టుకుని నిలబడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో NDAతో పొత్తులో భాగంగా పోటీ చేసిన 5 చోట్లా గెలిచి పట్టు నిలుపుకున్నారు. తాజాగా 29 స్థానాల్లో పోటీ చేసి 21 చోట్ల లీడింగ్‌లో ఉన్నారు.
News November 14, 2025
భారీ జీతంతో DIOలో ఉద్యోగాలు

డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్(DIO) 7 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 1వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc, B.Tech, BE, MSc, ME, M.Tech, MBA/PGDM అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. డిప్యూటీ ప్రోగ్రామ్ డైరెక్టర్‌కు నెలకు రూ.1,40,000-1,80,000, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.80,000-రూ.1,20,000, DPEకు రూ.40,000-రూ.80,000 చెల్లిస్తారు. వెబ్సైట్: idex.gov.in/
News November 14, 2025
‘మల్లె’ తోటల్లో కొమ్మల కత్తిరింపుతో లాభమేంటి?

మల్లె తోటల్లో కొమ్మ కత్తిరింపుల వల్ల మొక్క ఆరోగ్యం మెరుగుపడి, కొత్త కొమ్మలు త్వరగా పెరుగుతాయి. పువ్వు పరిమాణం, నాణ్యత, పువ్వుల దిగుబడి కూడా పెరుగుతుంది. చనిపోయిన, బలహీనమైన, అనారోగ్యకరమైన కొమ్మలను తొలగించడం వల్ల మొక్క మిగిలిన భాగాలకు శక్తి, పోషకాలు అంది మొక్క దృఢంగా పెరుగుతుంది. ప్రతి కొమ్మను నేల నుంచి 6-12 అంగుళాల ఎత్తులో కత్తిరించాలి. ప్రతి సీజన్లో 25-30% కొమ్మలను మాత్రమే తొలగించాలి.


