News September 23, 2025
ఆర్టీసీ ఉద్యోగులకు దసరా అడ్వాన్స్: సజ్జనార్

TG: ఆర్టీసీ ఉద్యోగులకు దసరా పండుగ అడ్వాన్స్ ఇవ్వాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. ఉద్యోగుల హోదా, నెల జీతం ఆధారంగా అడ్వాన్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది. తిరిగి వారి జీతం నుంచి నెలకు కొంత మొత్తంలో వసూలు చేస్తామని పేర్కొంది. ఈ మేరకు అధికారులతో సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే అడ్వాన్స్ చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News January 27, 2026
‘జననాయగన్’ సెన్సార్ వివాదంపై నేడు తీర్పు

తమిళ హీరో, TVK అధినేత విజయ్ నటించిన చివరి సినిమా ‘జననాయగన్’ (తెలుగులో జన నాయకుడు) సెన్సార్ కేసులో నేడు తీర్పు వెలువడనుంది. సెన్సార్ <<18907956>>వివాదంపై<<>> మద్రాస్ హైకోర్టు ఇటీవల తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. అనుకూలంగా తీర్పు వస్తే ఫిబ్రవరి 6న మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. హెచ్.వినోద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు నటించారు.
News January 27, 2026
మాఘ పౌర్ణమి రోజున రామకృష్ణ తీర్థంలో ఏం చేస్తారంటే..?

మాఘ పౌర్ణమి నాడు ఈ తీర్థంలో ముక్కోటి వేడుక వైభవంగా సాగుతుంది. ఆరోజు ఉదయం శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాల నడుమ పూలు, పండ్లు, ప్రసాదాలు, పూజా సామగ్రిని ఊరేగింపుగా తీర్థానికి తీసుకెళ్తారు. అక్కడ వెలసిన రాముడు, కృష్ణుడి విగ్రహాలకు అభిషేకాలు, పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తారు. అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేస్తారు. ఈ పవిత్ర దినాన తీర్థ స్నానం చేస్తే విశేష ఫలితాలుంటాయని నమ్మకం.
News January 27, 2026
మహిళలూ బంగారం జాగ్రత్త!

TG: రాష్ట్రంలో తరచుగా ఏదో ఒక చోట చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్నాయి. ఒంటరిగా ఉన్న మహిళలను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. బంగారం లాక్కొని పారిపోతున్నారు. దీంతో గోల్డ్ ధరించి బయటికి రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది. సంక్రాంతి తర్వాత HYD పరిధిలో 8 చైన్ స్నాచింగ్‌లు జరిగాయి. జగిత్యాల, NZB, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ ఇటీవల ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. అందుకే బంగారంతో బయటకు వెళ్తే జాగ్రత్త.


