News September 20, 2025
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. ఉచితంగా లడ్డూ ప్రసాదం

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవ ఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకుంది. మూలా నక్షత్రం, దశమి రోజుల్లో టికెట్లు లేకుండా దర్శనం కల్పించడంతో పాటు దర్శన సమయం 22 గంటలకు పెంచింది. ఉచితంగా లడ్డూ ప్రసాదం, పంచ హారతిలో ప్రముఖుల ప్రత్యేక దర్శనాల రద్దు, అంతరాలయ దర్శనాల నిలిపివేత, రూ.500 టికెట్లు రద్దు వంటి నిర్ణయాలు తీసుకుంది. కాగా ఈ నెల 22 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
Similar News
News September 20, 2025
రేపటి నుంచి దసరా సెలవులు

TG: గురుకులాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు దసరా సెలవులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3 వరకు సెలవులు ఉండనున్నాయి. అటు జూనియర్ కాలేజీలకు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు హాలిడేస్ ప్రకటించారు. మరోవైపు గురుకుల సొసైటీ పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కాలేజీలకు మాత్రం వారం రోజులు ఆలస్యంగా సెలవులు ఇచ్చారని, వాటికి కూడా రేపటి నుంచే సెలవులు ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
News September 20, 2025
ఏ రోజున ఏ బతుకమ్మ అంటే?

సెప్టెంబర్ 21 – ఎంగిలి పూల బతుకమ్మ
సెప్టెంబర్ 22 – అటుకుల బతుకమ్మ
సెప్టెంబర్ 23 – ముద్దపప్పు బతుకమ్మ
సెప్టెంబర్ 24 – నానే బియ్యం బతుకమ్మ
సెప్టెంబర్ 25 – అట్ల బతుకమ్మ
సెప్టెంబర్ 26 – అలిగిన బతుకమ్మ
సెప్టెంబర్ 27 – వేపకాయల బతుకమ్మ
సెప్టెంబర్ 28 – వెన్నెముద్దల బతుకమ్మ
సెప్టెంబర్ 29, 30(తిథి ఆధారంగా) – సద్దుల బతుకమ్మ
News September 20, 2025
బతుకమ్మ: ఏ రోజున ఏ నైవేద్యం? (1/2)

Day 1: ఎంగిలిపూల బతుకమ్మ – బియ్యం, నువ్వులు, బియ్యం పిండి
Day 2: అటుకుల బతుకమ్మ – బెల్లం, అటుకులు
Day 3: ముద్దపప్పు బతుకమ్మ – ముద్దపప్పు, పాలు, బెల్లం
Day 4: నానే బియ్యం బతుకమ్మ – నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం
Day 5: అట్ల బతుకమ్మ – గోధుమ అట్లు, దోశలు
Day 6: అలిగిన బతుకమ్మ – నైవేద్యం ఉండదు