News September 21, 2025

రేపటి నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు

image

AP: శ్రీశైలం మహాక్షేత్రంలో రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు. రేపు ఉ.9 గంటలకు అమ్మవారి ఆలయ యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మహర్నవమి సందర్భంగా అక్టోబర్ 1న ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొంటారు. అక్టోబర్ 2 దసరా రోజున తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.

Similar News

News September 21, 2025

ఈసారి దేవీ నవరాత్రులు 10 రోజులు ఎందుకు?

image

నేటి నుంచి ప్రారంభం కానున్న శరన్నవరాత్రి ఉత్సవాలు 9 రోజులకు బదులుగా 10 రోజులు జరగనున్నాయి. సెప్టెంబర్ 24, 25 తేదీలలో తృతీయ తిథి రెండు రోజులు ఉండటం వల్ల నవరాత్రి వేడుకల్లో ఒక రోజు పెరిగింది. భక్తులు ఈ 10 రోజుల పాటు అమ్మవారిని ఆరాధించవచ్చని, తద్వారా శక్తి, అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజుల్లో ఉపవాసం పాటిస్తూ.. దుర్గాదేవిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని సూచిస్తున్నారు.

News September 21, 2025

11 రోజుల్లో 11 అవతారాల్లో కనక దుర్గమ్మ

image

Sep 22 – శ్రీ బాలా త్రిపురసుందరిదేవి
Sep 23 – శ్రీ గాయత్రీ దేవి
Sep 24 – శ్రీ అన్నపూర్ణా దేవి
Sep 25 – శ్రీ కాత్యాయినీ దేవి
Sep 26 – శ్రీ మహా లక్ష్మీదేవి
Sep 27 – శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి
Sep 28 – శ్రీ మహా చండీదేవి, Sep 29 – శ్రీ సరస్వతీ దేవి
Sep 30 – శ్రీ దుర్గా దేవి, Oct 1 – శ్రీ మహిషాసురమర్ధినీ దేవి
Oct 2 – శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం

News September 21, 2025

మోదీని కలిశా కానీ మాట్లాడలేదు: ప్రకాశ్ రాజ్

image

ప్రధాని మోదీపై నిప్పులు చెరిగే సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నేను ఎయిర్‌పోర్టులో ఆయన్ను కలిశాను. కానీ మాట్లాడలేదు’ అని మోదీ కటౌట్ ఎదురుగా తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. ‘మోదీని కలిసేంత కెపాసిటీ మీకు లేదు. ఇదే ఎక్కువ’ అని కొందరు ప్రకాశ్ రాజ్‌పై సెటైర్లు వేస్తున్నారు. ‘మోదీ టెలిప్రాంప్టర్ లేకుండా మాట్లాడలేరు. మీతో అసలే మాట్లాడరు’ అని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.