News October 2, 2024

రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు

image

AP: రేపటి నుంచి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరుగుతాయి. పది రోజుల్లో అమ్మవారు పది రూపాల్లో దర్శనమిస్తారు. ఈ ఉత్సవాలు ముగిసే వరకూ అంతరాలయ దర్శనాలు రద్దు చేశారు. మొత్తం 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. కాగా ఇవాళ విజయవాడలో కురిసిన భారీ వర్షం కారణంగా ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల పనులకు అంతరాయం ఏర్పడింది. వీఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News December 30, 2024

కెరీర్‌లోనే రోహిత్ శర్మ చెత్త రికార్డు

image

టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఈ ఏడాది 619 రన్స్ చేసిన అతను 24.76 యావరేజ్‌ నమోదుచేశారు. 11 ఏళ్ల టెస్టు కెరీర్‌లో ఇదే అత్యల్ప యావరేజ్. 2013లో 66.60, 2014లో 26.33, 2015లో 25.07, 2016లో 57.60, 2017లో 217, 2018లో 26.28, 2019లో 92.66, 2021లో 47.68, 2022లో 30, 2023లో 41.92 యావరేజ్‌తో రన్స్ చేశారు.

News December 30, 2024

vitamin D దొరికే ఫుడ్స్ ఇవే

image

ఒంటికి మేలు చేసే <<15021724>>vitamin D<<>> ఆహారంలో కన్నా సూర్యరశ్మి ద్వారా పుష్కలంగా లభిస్తుంది. అందుకే ఉదయం, సాయంత్రం పడే ఎండలో వాకింగ్, ఎక్సర్‌సైజులు చేయాలని వైద్యులు సూచిస్తారు. ఇక సాల్మన్, సార్డైన్స్, హెర్రింగ్, మాకెరెల్ వంటి చేప నూనెలో బాగా దొరుకుతుంది. రెడ్ మీట్, లివర్, కోడిగుడ్డు సొన, కొన్ని తృణ ధాన్యాల్లోనూ లభిస్తుంది. వైద్యులు, న్యూట్రిషనిస్టుల సూచన మేరకు vitamin D సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.

News December 30, 2024

సిఫారసు లేఖల వ్యవహారం: రేవంత్ రెడ్డికి సీఎం చంద్రబాబు లేఖ

image

AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల వ్యవహారంపై ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. ఇకపై వారి సిఫారసు లేఖలను అనుమతిస్తామని తెలిపారు. ప్రతివారం(సోమవారం నుంచి గురువారం) ఏదైనా రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం, ప్రత్యేక దర్శనం కోసం రెండు లేఖలను అంగీకరిస్తామని పేర్కొన్నారు.