News September 21, 2025

దసరా ఉత్సవాలు: కనకదుర్గమ్మ 11 అలంకారాలు

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు రేపటి నుంచి OCT 2 వరకు జరగనున్నాయి. 11 రోజుల పాటు దుర్గమ్మ 11 అలంకారాలలో దర్శనమివ్వనున్నారు.
*SEP 22:బాలాత్రిపుర సుందరీ దేవి *23:గాయత్రీ దేవి *24:అన్నపూర్ణాదేవి *25:కాత్యాయనీ దేవి *26:మహాలక్ష్మీ దేవి *27:లలితా త్రిపుర సుందరీ దేవి *28:మహాచండీ దేవి *29:సరస్వతీ దేవి *30:దుర్గాదేవి *అక్టోబర్ 1:మహిషాసురమర్దిని దేవి *అక్టోబర్ 2:రాజరాజేశ్వరీ దేవి

Similar News

News September 21, 2025

H1B ఫీజు రూల్స్.. పూర్తి వివరాలు

image

*కొత్తగా H1B కోసం అప్లై చేసుకునే వారికే వర్తిస్తుంది. (అంటే 2026 నుంచి వీసా పిటిషన్ ఫైల్ చేసే వారికి)
*కొత్త వీసా కోసం కంపెనీలు లక్ష డాలర్లు ఒకేసారి చెల్లించాలి. ప్రతి ఏడాది కట్టాల్సిన అవసరం లేదు
*ప్రస్తుతం H1B వీసా ఉన్నవారికి ఇది వర్తించదు
*వీసా రెన్యూవల్స్, 2025 లాటరీ విన్నర్లకూ మినహాయింపు
*ప్రస్తుతం వీసా ఉన్నవారు ఇతర దేశాలకు వెళ్లవచ్చు. తిరిగి అమెరికాకు వచ్చేటప్పుడు ఎలాంటి అడ్డంకులు ఉండవు.

News September 21, 2025

లైంగిక వేధింపులపై యువతి ఫిర్యాదు.. KA పాల్‌పై కేసు నమోదు

image

TG: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్‌పై కేసు నమోదైంది. తనను పాల్ లైంగికంగా వేధించాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు FIR నమోదు చేశారు. ఫిర్యాదు చేసిన యువతి కేఏ పాల్ వద్ద పని చేసినట్లు తెలుస్తోంది.

News September 21, 2025

ఈసారి దేవీ నవరాత్రులు 10 రోజులు ఎందుకు?

image

నేటి నుంచి ప్రారంభం కానున్న శరన్నవరాత్రి ఉత్సవాలు 9 రోజులకు బదులుగా 10 రోజులు జరగనున్నాయి. సెప్టెంబర్ 24, 25 తేదీలలో తృతీయ తిథి రెండు రోజులు ఉండటం వల్ల నవరాత్రి వేడుకల్లో ఒక రోజు పెరిగింది. భక్తులు ఈ 10 రోజుల పాటు అమ్మవారిని ఆరాధించవచ్చని, తద్వారా శక్తి, అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజుల్లో ఉపవాసం పాటిస్తూ.. దుర్గాదేవిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని సూచిస్తున్నారు.