News October 3, 2025
ముగిసిన దసరా సెలవులు

AP: రాష్ట్రంలో స్కూళ్లకు దసరా సెలవులు నిన్నటితో ముగిశాయి. ఇవాళ్టి నుంచి క్లాసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి వరుసగా 11 రోజుల పాటు హాలిడేస్ ఆస్వాదించిన విద్యార్థులు, టీచర్లు ఇక బడి బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. పండుగ కోసం ఊర్లకు వెళ్లినవారు ప్రభుత్వం సెలవులను ఒక్కరోజైనా పొడిగిస్తుందని ఆశగా ఎదురుచూశారు. నిన్న రాత్రి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో నిరాశచెందారు.
Similar News
News October 3, 2025
వాంగ్‌చుక్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్

పర్యావరణవేత్త సోనమ్ <<17826407>>వాంగ్‌చుక్<<>>ను రిలీజ్ చేసేలా ఆదేశించాలని ఆయన భార్య గీతాంజలి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భర్తను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఘర్షణలకు ఒకరిని బలిపశువును చేయాలని, లద్దాక్ పోలీసులు ఓ అజెండాతో పనిచేస్తున్నారని ఆరోపించారు. తన భర్తను కలిసేందుకు తాను అర్హురాలిని కాదా అంటూ రాష్ట్రపతి ముర్ము, PM మోదీకి లేఖ రాశారు.
News October 3, 2025
యంత్ర ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

యంత్ర ఇండియా లిమిటెడ్( మహారాష్ట్ర) 2 సీనియర్, 3 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. ICAI, ICMAI, HSSC, CA, CMA విద్యార్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు గరిష్ఠ వయసు 40ఏళ్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు గరిష్ఠ వయసు 50ఏళ్లు.
News October 3, 2025
అమానుషం.. ప్రాణం పోతున్నా చేతులకు బేడీలు

బంగ్లాదేశ్ మాజీ మంత్రి నూరుల్ మాజిద్ మరణంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఓ కేసులో అరెస్టైన ఆయన తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో మరణించగా అదే సమయంలో చేతికి బేడీలు ఉన్న ఫొటో SMలో వైరలవుతోంది. యూనస్ ప్రభుత్వం తీరు అమానుషమని అవామీ లీగ్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. అయితే పారిపోకుండా ఉండేందుకు బేడీలు వేశామని పోలీసులు చెప్పడం గమనార్హం. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు నూరుల్ సన్నిహితుడు.