News October 9, 2024
దసరా: స్పెషల్ బస్సుల్లో టికెట్ ఛార్జీల పెంపు!

TG: దసరా పండుగకు నడుపుతున్న TGSRTC స్పెషల్ బస్సుల్లో టికెట్ ఛార్జీలు పెంచారని ప్రయాణికులు వాపోతున్నారు. సాధారణ ఛార్జీల కంటే 25% వరకు అదనంగా వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇదివరకు ఉప్పల్ నుంచి తొర్రూరుకు సూపర్ లగ్జరీలో టికెట్ రూ.310గా ఉంటే ఇప్పుడు రూ.360 తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఛార్జీల పెంపుపై ఆర్టీసీ అధికారిక ప్రకటన చేయలేదు.
Similar News
News January 5, 2026
రబీ వరిలో ఈ సమస్యలు కనిపిస్తున్నాయా?

తెలుగు రాష్ట్రాల్లో వరి పంట ఒక్కో ప్రాంతంలో ఒక్కో దశలో ఉంది. అయితే వరి ప్రారంభ దశ నుంచి జింకు లోపం, కాండం తొలుచు పురుగు పంటపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జింకు లోపం వల్ల వరి పొలాల్లో పిలకలు ఆలస్యంగా, తక్కువగా వచ్చి పైరు సరిగా పెరగదు. ఇక కాండం తొలుచు పురుగు మొక్క మొవ్వులోకి చొచ్చుకెళ్లి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. వరిలో జింకు లోపం, కాండం తొలుచు పురుగు నివారణకు సూచనల కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News January 5, 2026
జాగ్రత్త..! మళ్లీ పెరిగిన చలి

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాస్త తగ్గిన చలి మళ్లీ విజృంభిస్తోంది. ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి. ఈ నెల 12 వరకు కోల్డ్ వేవ్స్ వీస్తాయని IMD ఇప్పటికే తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా అలుముకుంటోంది. చలి నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఉదయం, రాత్రి వేళల్లో అవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
News January 5, 2026
వరి చేనులో జింకు లోపాన్ని ఎలా గుర్తించాలి?

వరి పంట పెరుగుదల, దిగుబడిలో జింకు సూక్ష్మపోషకం కీలక పాత్ర పోషిస్తుంది. వరి విత్తనం మొలకెత్తిన దశ నుంచి చివరి వరకూ జింకు అవసరం. ముఖ్యంగా చిరు పొట్ట దశలో జింకు అవసరం ఎక్కువగా ఉంటుంది. జింకు లోపం వచ్చిన వరి పొలాల్లో పిలకలు ఆలస్యంగా, తక్కువగా వస్తాయి. అంతేకాకుండా వచ్చిన వరి పిలకలు సరిగా పెరగవు. దీంతో పైరు ఎదగకుండా గిడసబారి కనిపిస్తుంది. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు ఎదుగుదలలో మార్పు కనిపించదు.


