News October 5, 2025
దసరా స్పెషల్.. ఆర్టీసీకి ₹110 కోట్ల ఆదాయం

దసరా నేపథ్యంలో ₹110 కోట్ల ఆదాయం సమకూరినట్లు TGSRTC తెలిపింది. 7,754 స్పెషల్ బస్సులు తిప్పాలని నిర్ణయించినా ప్రయాణికులు లేకపోవడంతో 5,300 బస్సులే నడిపినట్లు వెల్లడించింది. గతేడాది 6,300 ప్రత్యేక బస్సులు వేయగా ₹114 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొంది. ఈసారి సొంతూళ్లకు వెళ్లేవారి సంఖ్య తగ్గడం, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించడంతో ఆదాయం తగ్గినట్లు వివరించింది. కాగా ఇవాళ, రేపు బస్సుల్లో రద్దీ పెరిగే ఛాన్స్ ఉంది.
Similar News
News March 31, 2026
కరెంట్ అఫైర్స్

* పారాలింపిక్ మెడలిస్ట్ షీతల్ దేవికి ‘పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ 2025’ పురస్కారం
* తెలంగాణ అసెంబ్లీలో గిగ్ వర్కర్స్ బిల్లు, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు సహా పది బిల్లులకు ఆమోదం
* బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ రాజీనామా
* జీవితకాల కనిష్ఠాన్ని (₹95.12) తాకిన రూపాయి విలువ
* ₹3.24లక్షల కోట్ల బడ్జెట్‌కు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం
* PMAY, టిడ్కో స్కిమ్ కింద మరో 2.50లక్షల ఇళ్లను పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వం
News March 31, 2026
ఆందోళన వద్దు.. రూపాయి బానే ఉంది: నిర్మల

రూపాయి <<19515449>>పతనంపై<<>> ఆందోళన అక్కర్లేదని పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి మార్చి 27 నాటికి రూపాయి 4.1% పడిపోయిందని తెలిపారు. అయితే సౌత్ కొరియన్ వాన్ (4.6%), థాయ్ భట్ (5.5%), ఫిలిప్పైన్ పెసో (4.8%) మొదలైన కరెన్సీలు ఇంతకన్నా ఎక్కువ క్షీణించాయన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని.. ఆర్థికలోటును అదుపులో ఉంచడంపై భారత్‌కు ప్రశంసలు దక్కుతున్నాయన్నారు.
News March 31, 2026
ఏప్రిల్‌లో పాకిస్థాన్‌కు 3వేల మంది భారతీయులు

భారత్ నుంచి ఏప్రిల్‌లో దాదాపు 3000 మంది సిక్కు యాత్రికులు పాకిస్థాన్ వెళ్లనున్నారు. అక్కడి పంజాబ్ ప్రావిన్స్‌లో ఏప్రిల్ 10న మొదలయ్యే బైశాఖి ఉత్సవాల్లో వీరు పాల్గొంటారు. దీంతో పాటు లాహోర్, కర్తపూర్, ఎమినాబాద్, ఫరూఖాబాద్, నాన్‌కనా సాహిబ్ వంటి సిక్కుల పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నట్లు పాక్ అధికారులు తెలిపారు. ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా పాక్ ఏటా వీరి కోసం ప్రత్యేక ‘జథా’ వీసాలు కల్పిస్తోంది.


