News September 28, 2025

దసరా: పల్లెబాట.. బస్టాండ్లు కిటకిట

image

TG: దసరాకు మరో 3 రోజులే ఉండటంతో ప్రజలు పట్నం నుంచి సొంతూళ్లకు పయనమవుతున్నారు. HYDలోని JBS, CBS బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు, మియాపూర్, LBనగర్‌, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాలు ప్రయాణికులతో రద్దీగా మారాయి. TGSRTC సుమారు 7వేలకు పైగా స్పెషల్ బస్సులు నడుపుతున్నా సీట్లు దొరకడం లేదని ప్రజలు వాపోతున్నారు. అటు MGBSలో బురద తొలగింపు ప్రక్రియ కొలిక్కి రావడంతో బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి.

Similar News

News February 8, 2026

చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>చెన్నై <<>>మెట్రో రైల్ లిమిటెడ్ 19 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు ఫిబ్రవరి 23 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, ME/MTech అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.62,000 నుంచి రూ.2,70,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://chennaimetrorail.org

News February 8, 2026

విద్యార్థులకు అస్వస్థత.. కారకులపై CM సీరియస్

image

AP: పోలవరం(D) దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్‌ విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడానికి గల కారకులపై CM CBN ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి‌లోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. బాధ్యులపై శాఖాపరమైన, అవసరాన్ని బట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. కాగా నిన్న టిఫిన్ చేశాక 92మంది విద్యార్థులకు కడుపునొప్పి, జ్వరం రావడంతో ఆస్పత్రులకు తరలించామని అధికారులు వివరించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కుదుటపడిందన్నారు.

News February 8, 2026

ప్రతి తప్పుకు శిక్ష ఉంటుంది!

image

గరుడ పురాణం ప్రకారం మనం చేసే ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. పాపపుణ్యాల తీవ్రతను బట్టి నరకంలోని శిక్షలు ఉంటాయి. స్వర్గంలోని లోకాలు మారుతుంటాయి. ఈ లోకాలు భువర్లోకం నుంచి సత్యలోకం వరకు ఉంటాయి. జ్ఞానం, భక్తి, త్యాగాల ద్వారా వైకుంఠం, కైలాసం వంటి ఉన్నత స్థితిని పొందవచ్చు. స్వర్గనరకాలు మనం ఎంచుకున్న మార్గాలేనని, జీవితం పరీక్ష అయితే ‘కర్మ’ తుది తీర్పు అని ఈ పురాణం హెచ్చరిస్తోంది. సత్కర్మలే సద్గతికి ఆధారం.