News August 3, 2024

ఖెలీఫాకు ద్యుతీచంద్ మద్దతు

image

పారిస్ ఒలింపిక్స్‌లో వివాదాస్పద <<13755882>>బాక్సర్<<>> ఇమానే ఖెలీఫాకు భారత స్ప్రింటర్ ద్యుతీచంద్ మద్దతుగా నిలిచారు. ‘ఒలింపిక్స్ కమిటీకి లేని అభ్యంతరం ప్రత్యర్థులకు ఎందుకు? పోటీలకు వచ్చేముందే అథ్లెట్లకు జెండర్, హార్మోనల్, డోపింగ్ టెస్టులు చేస్తారు. అవన్నీ ఖెలీఫా ఎదుర్కొన్నారు. బౌట్‌లో ప్రత్యర్థి గెలిచి ఉంటే ఈ చర్చ జరిగేది కాదు’ అని అన్నారు. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ తనను ఇదే సాకుతో తప్పించారని వాపోయారు.

Similar News

News November 23, 2025

లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్

image

⭒ ‘విరూపాక్ష’ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న సినిమాకు రూ.120 కోట్ల బడ్జెట్: సినీ వర్గాలు
⭒ ఈ నెల 28న నెట్‌ఫ్లిక్స్‌లోకి విష్ణు విశాల్ నటించిన ‘ఆర్యన్’ మూవీ
⭒ కమల్ నిర్మాణంలో రజినీ నటించబోయే సినిమాను ‘మహారాజ’ ఫేమ్ నిథిలన్ లేదా ‘పార్కింగ్’ ఫేమ్ రామ్ కుమార్ డైరెక్ట్ చేయనున్నట్లు టాక్
⭒ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కు తొలుత ‘మాస్టర్ పీస్’ అనే టైటిల్ అనుకున్నాం: డైరెక్టర్ మహేశ్

News November 23, 2025

వాహనదారులకు అలర్ట్.. ఓవర్‌లోడ్‌తో పట్టుబడితే..

image

TG: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆకస్మిక తనిఖీల కోసం 33 జిల్లా, 3 రాష్ట్ర స్థాయి స్క్వాడ్‌లను ఏర్పాటు చేసింది. గత 10రోజుల్లో 4,748 కేసులు నమోదవగా, 3,420 వాహనాలు సీజ్ చేశారు. ఓవర్‌లోడ్‌తో వెళ్తూ తొలిసారి పట్టుబడితే వెహికల్ సీజ్ చేస్తారు. రెండో సారి పర్మిట్, డ్రైవర్ లైసెన్స్ రద్దు చేస్తారు. ఇకపై లైసెన్స్ రెన్యువల్ టైంలో భారీ వాహనాల డ్రైవర్లకు రీఫ్రెషర్ ట్రైనింగ్ ఉంటుంది.

News November 23, 2025

జట్టులోకి గిల్ రీఎంట్రీ అప్పుడేనా?

image

టీమ్ ఇండియా టెస్ట్, ODI కెప్టెన్ గిల్ SAతో జరిగే ODI, T20 సిరీస్‌లో ఆడటం కష్టమని క్రీడా వర్గాలు వెల్లడించాయి. మెడ నొప్పి నుంచి ఆయన పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టొచ్చని పేర్కొన్నాయి. 2026 జనవరి 11 నుంచి NZతో జరిగే ODI సిరీస్‌లో ఆయన రీఎంట్రీ ఇస్తారని తెలిపాయి. కాగా SAతో ODI, T20 సిరీస్‌కు BCCI ఇవాళ జట్టును ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ODIలకు KL/అక్షర్/పంత్‌లో ఒకరు కెప్టెన్సీ చేసే ఛాన్సుంది.