News August 30, 2024

రాత్రిళ్లు డ్యూటీ.. ఆయుధాలు ఉండాల్సిందే: IMA సర్వే

image

నైట్ షిఫ్టులు సురక్షితం కాదని 35% డాక్టర్లు(ముఖ్యంగా మహిళలు) భావిస్తున్నట్లు IMA సర్వే పేర్కొంది. మరికొందరేమో ఆత్మరక్షణ కోసం ఆయుధాలు వెంట ఉండాలని అభిప్రాయపడినట్లు తెలిపింది. రాత్రి వేళ విధులు నిర్వహించే వారికి కనీసం డ్యూటీ రూమ్ కూడా అందుబాటులో లేదని 45 శాతం మంది చెప్పారని వెల్లడించింది. పనిచేసే చోట సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బందితో పాటు సరైన వెలుతురు, అలారమ్ సిస్టమ్స్ ఉంచాలని సూచించారని తెలిపింది.

Similar News

News February 12, 2026

సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్.. తేడాలేంటో తెలుసా?

image

సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ ఇద్దరూ మానసిక ఆరోగ్యనిపుణులే అయినప్పటికీ చదువు, చికిత్స పద్ధతుల్లో తేడాలు ఉంటాయి. సైకియాట్రిస్టులు డాక్టర్లు (MBBS/MD). వీరు మందుల ద్వారా చికిత్స చేస్తారు. మరోవైపు సైకాలజిస్టులు ప్రొఫెషనల్ వైద్యులు కాదు. డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి సమస్యలను టాక్ థెరపీ/కౌన్సెలింగ్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తారు. వీరికి మందులు రాసే అధికారం ఉండదు.

News February 12, 2026

ఫలితాలకు ముందే క్యాంపు రాజకీయాలు!

image

TG: మున్సిపల్ ఫలితాలు వెల్లడికాక ముందే పార్టీలు క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టాయి. తమకు మెజార్టీ వచ్చే స్థానాల్లోని అభ్యర్థులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాయి. BRS MLA జగదీశ్ రెడ్డి సూర్యాపేట నుంచి అభ్యర్థులను HYD శివార్లలోని రహస్య ప్రాంతానికి తరలించారు. మంచిర్యాల నుంచి తడోబాకు, ఆదిలాబాద్ నుంచి అయోధ్యకు బీజేపీ అభ్యర్థులను తీసుకెళ్లారు. అటు కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థులను ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది.

News February 12, 2026

కిసాన్ రైల్ ద్వారా 34 వేల టన్నుల పంట ఉత్పత్తుల రవాణా

image

ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు కిసాన్ రైల్ ద్వారా 116 సర్వీసులతో 34వేల టన్నుల పంట ఉత్పత్తులను వివిధ రాష్ట్రాలకు రవాణా చేశామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 2020 AUG 7న కిసాన్ రైళ్లను కేంద్రం ప్రారంభించింది. AP నుంచి మామిడి, అరటి, ఉల్లి ఇతర ఉద్యాన ఉత్పత్తులను బిహార్, అస్సాం, ప.బెంగాల్, ఢిల్లీ, త్రిపురలకు రవాణా చేశామని.. లోక్‌సభలో TDP MP ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.