News April 22, 2025
వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్

AP: YCP నేత, MLC దువ్వాడ శ్రీనివాస్‌కు ఆ పార్టీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. మాజీ CM, ఆ పార్టీ అధినేత YS జగన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కార్యాలయం ప్రకటించింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. దువ్వాడ కుటుంబ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
Similar News
News November 18, 2025
POK ప్రధానిగా రజా ఫైసల్

పాక్ ఆక్రమిత కశ్మీర్ నూతన ప్రధానిగా PPP నేత రజా ఫైసల్ ముంతాజ్ ఎన్నికయ్యారు. ఇమ్రాన్ ఖాన్ PTI పార్టీకి చెందిన అన్వరుల్ హక్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి ఆమోదం లభించడంతో కొత్త ప్రధాని కోసం ఓటింగ్ నిర్వహించారు. 52 సభ్యులకు గాను ముంతాజ్‌కు 32 మంది అనుకూలంగా ఓటేశారు. కాగా POKకు స్వయంప్రతిపత్తిని కల్పించినట్లు చెప్పుకునే పాక్ అక్కడ నామమాత్రపు PM, ప్రెసిడెంట్ పదవులను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

పిల్లల చర్మం పొడిబారకుండా ఉండాలంటే..

పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. స్నానానికి ముందు నువ్వుల నూనెలను ఒంటికి మర్దన చేసి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించాలి. సబ్బు వీలైనంత తక్కువగా వాడాలి. స్నానం తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి. సెరమైడ్స్, గ్లిజరిన్, షియా బటర్, మ్యాంగో బటర్ కాంబినేషన్‌లో ఉండే వాటిని ఎంచుకోవాలి. ఇవి పిల్లల చర్మాన్ని మృదువుగా చేస్తాయి.