News June 25, 2024
రాజధాని కోసం డ్వాక్రా మహిళల రూ.4.50 కోట్ల విరాళం

AP: అమరావతి నిర్మాణం కోసం చిత్తూరు జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు రూ.4.5 కోట్ల భారీ విరాళాన్ని సేకరించారు. ఆ చెక్కును సీఎం చంద్రబాబుకు ఈరోజు అందజేశారు. పాతికేళ్ల క్రితం డ్వాక్రా మహిళల కోసం చంద్రబాబు వేసిన విత్తనమే నేడు మహావృక్షమై లక్షలాది కుటుంబాలను ఆదుకుంటోందని ఈ సందర్భంగా కొనియాడారు. ఆ విశ్వాసంతోనే అమరావతి నిర్మాణం కోసం ఉడతాభక్తిగా విరాళాన్ని కలెక్ట్ చేసి అందజేశామని వారు వెల్లడించారు.
Similar News
News October 29, 2025
రేపు కాలేజీల బంద్: SFI

TG: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత, ప్రొఫెషనల్ విద్యాసంస్థలు, యూనివర్సిటీల బంద్‌కు <<18122140>>SFI<<>> పిలుపునిచ్చింది. దీంతో పలు కాలేజీలు రేపు సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. మరోవైపు వర్షాల నేపథ్యంలో సిద్దిపేట, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని స్కూళ్లకు రేపు హాలిడే ఇచ్చారు.
News October 29, 2025
రష్యా దూకుడు.. ఈ సారి అండర్ వాటర్ డ్రోన్ ప్రయోగం

అణుశక్తితో నడిచే మరో ఆయుధాన్ని రష్యా ప్రయోగించింది. అండర్ వాటర్ డ్రోన్ ‘Poseidon’ను టెస్ట్ చేసినట్లు ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఇది న్యూక్లియర్ పవర్ యూనిట్ అమర్చిన మానవరహిత వెహికల్ అని తెలిపారు. ఆ డ్రోన్‌ను ఇంటర్సెప్ట్ చేసే మార్గమే లేదని చెప్పారు. వారం రోజుల వ్యవధిలో రష్యా నిర్వహించిన రెండో పరీక్ష ఇది. ఇటీవల న్యూక్లియర్ పవర్డ్ క్రూయిజ్ <<18109096>>మిసైల్ <<>>Burevestnikను ప్రయోగించడం తెలిసిందే.
News October 29, 2025
‘బ్రేకప్ అయింది సర్.. లీవ్ కావాలి’

లీవ్ కోసం ఓ ఉద్యోగి తన బాస్‌కు పంపిన రిక్వెస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఇటీవలే నాకు బ్రేకప్ అయింది. పనిపై దృష్టి పెట్టలేకపోతున్నా. నాకు ఈనెల 28 నుంచి వచ్చే నెల 8 వరకు సెలవు కావాలి’ అని ఎంప్లాయ్ పెట్టిన మెయిల్‌ను ‘Knot Dating’ సంస్థ CEO జస్వీర్ సింగ్ షేర్ చేశారు. అత్యంత నిజాయతీగా అడగడంతో వెంటనే లీవ్ ఇచ్చానని పేర్కొన్నారు. దీనికి లైకులు, కామెంట్లు పోటెత్తుతున్నాయి.


