News September 27, 2024
KKR మెంటార్‌గా డ్వేన్ బ్రావో

వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన అభిమానులు నిరాశ చెందారు. కానీ, ఐపీఎల్-2025లో మెంటర్‌గా తిరిగి తన మార్క్‌ను చూపేందుకు సిద్ధమయ్యారు. కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా బ్రావోను నియమిస్తున్నట్లు KKR తెలిపింది. గత సీజన్లో మెంటార్‌గా ఉన్న గంభీర్ టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా వెళ్లారు. ఆయన స్థానంలో జట్టు గెలుపు కోసం బ్రావో కృషి చేయనున్నారు.
Similar News
News October 25, 2025
ఆర్థరైటిస్ ఎలా నివారించాలి?

మహిళల్లో కీళ్ల నొప్పులను(ఆర్థరైటిస్) నివారించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేస్తూ బరువు, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. నడక, ఈత, సైక్లింగ్ వంటివి కండరాలను బలోపేతం చేస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండే చేపలు, అవిసె గింజలు, వాల్నట్, ఆలివ్ ఆయిల్ వంటి ఆహారాలు తీసుకోవాలి. అవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు అధికంగా తీసుకోవాలి.
News October 25, 2025
పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,250 పెరిగి ₹1,25,620కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,150 ఎగిసి ₹1,15,150గా ఉంది. అటు KG వెండి ధర రూ.1,70,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 25, 2025
డైట్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

AP: డైట్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల ఖాళీలను డిప్యూటేషన్ ప్రాతిపదికన భర్తీకి SCERT నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 29 నుంచి లీప్ యాప్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. వచ్చే నెల 5-8 వరకు రాత పరీక్షలు నిర్వహించి, 13న రిజల్ట్స్ వెల్లడిస్తామని తెలిపింది. అనంతరం త్రిసభ్య కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందని వెల్లడించింది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుందని స్పష్టం చేసింది.


