News September 27, 2024

క్రికెట్‌కు డ్వేన్ బ్రావో వీడ్కోలు

image

వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపారు. కాగా 41 ఏళ్ల బ్రావో 2015లో టెస్టులు, 2021లో వన్డేలు, టీ20లకు గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆయన ఫ్రాంచైజీ క్రికెట్‌కు స్వస్తి పలికారు. 582 టీ20ల్లో 6,970 పరుగులతోపాటు 631 వికెట్లు కూడా పడగొట్టారు. IPLలో 161 మ్యాచ్‌లు ఆడారు.

Similar News

News January 16, 2026

కనుమ – ముక్కనుమ: తేడాలేంటి?

image

నేడు కనుమ. రేపు ముక్కనుమ. ఈ పండుగలు పల్లె సంస్కృతికి అద్దం పడతాయి. కనుమ నాడు వ్యవసాయానికి చేదోడుగా నిలిచే పశువులను పూజించి కృతజ్ఞతలు తెలుపుతారు. ఇక ముక్కనుమ పండుగ ముగింపు సంబరం. ఈరోజున పశువులను చెరువులలో శుభ్రంగా కడిగి విశ్రాంతినిస్తారు. కనుమ రోజున శాకాహారానికి ప్రాధాన్యత ఉంటే, ముక్కనుమ నాడు మాంసాహార విందులు, గ్రామ దేవతల ఆరాధన, బొమ్మల నోము వంటి కార్యక్రమాలతో పండుగకు ఘనంగా ముగింపు పలుకుతారు.

News January 16, 2026

NTR ‘డ్రాగన్’ మూవీలో అనిల్ కపూర్

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ‘డ్రాగన్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ చేరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్‌స్టా వేదికగా ధ్రువీకరించారు. అనిల్ కపూర్ రాకతో మూవీ హైప్ అమాంతం పెరిగింది. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2026లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

News January 16, 2026

ఎల్లుండి ‘మౌని అమావాస్య’.. ఏం చేయాలి?

image

మౌని(చొల్లంగి) అమావాస్య ఈ ఏడాది JAN 18న వచ్చింది. 18న 12.03amకి ప్రారంభమై 19న 1.21amకు ముగుస్తుంది. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేస్తే పాపాలు తొలగి, మోక్షం లభిస్తుందని నమ్మకం. పితృదేవతలకు పిండ ప్రదానం చేసి నీళ్లు, నువ్వులతో తర్పణాలు వదిలితే వారు ఉత్తమ లోకాలకు చేరుకొని ఆశీర్వదిస్తారని పండితులు చెబుతున్నారు. మౌన వ్రతం, శివుడికి రుద్రాభిషేకం, నవగ్రహ ప్రదక్షిణ చేస్తే మంచి జరుగుతుందట.