News January 31, 2026

Dy.CMగా సునేత్ర.. కేటాయించే శాఖలివే..

image

దివంగత నేత అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ఇవాళ సా.5 గంటలకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెకు ఎక్సైజ్, క్రీడల శాఖలను కేటాయించనున్నారు. అంతకుముందు సునేత్రను NCP ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారు. అటు అజిత్ మరణంతో ఖాళీ అయిన బారామతి అసెంబ్లీ స్థానం నుంచి సునేత్ర పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న రాజ్యసభ సభ్యత్వానికి ఆమె రాజీనామా చేస్తారు.

Similar News

News February 28, 2026

ఇండియన్స్‌కు ఎంబసీల సూచనలు

image

యుద్ధ <<19260918>>వాతావరణం<<>> దృష్ట్యా ఇజ్రాయెల్‌, ఇరాన్‌లోని భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయాలు సూచించాయి. అనవసర ప్రయాణాలు మానుకోవాలని, స్థానిక భద్రతా మార్గదర్శకాలను పాటించాలని పేర్కొన్నాయి. ఎమర్జెన్సీ అయితే ఇజ్రాయెల్‌లో +972-54-7520711, ఇరాన్‌లో +989128109115 OR +989128109109 నంబర్లకు కాల్ చేయాలని తెలిపాయి. అలాగే ఇరు దేశాల ఎయిర్‌స్పేస్‌ను మూసేయడంతో ఎక్కడికక్కడ విమాన ప్రయాణాలు ఆగిపోయాయి.

News February 28, 2026

మోదీ పర్యటన ముగిసిన వెంటనే ప్లాన్ అమలు!

image

ఇరాన్‌పై దాడికి అమెరికా-ఇజ్రాయెల్ చాలా రోజుల కిందటే ప్లాన్ చేశాయి. భారత PM మోదీ ఈ నెల 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్‌లో పర్యటించిన నేపథ్యంలో అటాక్‌ను వాయిదా వేసినట్లు నిపుణుల అంచనా. ఆయన దేశంలో ఉండగా ఉద్రిక్తతలకు తావు లేకుండా నెతన్యాహు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. కాగా మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన వెంటనే ఇరాన్‌పై US దాడి చేస్తుందని MIM చీఫ్ అసదుద్దీన్ ఇటీవల చెప్పిన <<19240749>>జోస్యం<<>> నిజమైంది.

News February 28, 2026

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

image

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో 5(JRF, ప్రాజెక్ట్ అసిస్టెంట్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. MSc(లైఫ్ సెన్సెస్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 25వరకు అప్లై చేసుకోవచ్చు. JRFకు నెలకు రూ.46,990, ప్రాజెక్ట్ అసిస్టెంట్స్‌కు రూ.30,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://uohyd.ac.in